దీప్తి-షన్ను ల పెళ్ళికి ఒకే ఒక్క కండిషన్ పెట్టిన పేరెంట్స్.. అలా అయితేనే పెళ్ళికి ఒప్పుకుంటాం అంటూ..

దీప్తి-షన్ను ల పెళ్ళికి ఒకే ఒక్క కండిషన్ పెట్టిన పేరెంట్స్.. అలా అయితేనే పెళ్ళికి ఒప్పుకుంటాం అంటూ..

by Anudeep

Ads

సోషల్ మీడియా హిట్ పెయిర్ ఎవరు అనగానే గుర్తొచ్చే పెయిర్స్ లో దీప్తి-షన్ను పెయిర్ కూడా ఉంటుంది. వీరిద్దరూ చాలా కాలం నుంచే లవ్ లో ఉన్నారు. యు ట్యూబ్ లో వీరు చేసే కవర్ సాంగ్స్ కి ఎక్కడలేని ఫాలోయింగ్ ఉంటుంది.

Video Advertisement

వీరి పెయిర్ కి కూడా చాలా మందే అభిమానులు ఉన్నారు. ఇక స్టేజి షోలపై వీరు ఒకరిపై ఒకరు కురిపించుకునే అభిమానానికి అంతే లేదు. ఈ క్రమంలో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఫీల్ అయ్యే అభిమానులు కూడా లేకపోలేదు.

deepthi-shannu 1

రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ కి దీప్తి సునయన వచ్చిన సంగతి తెలిసిందే. షన్నుతో మాట్లాడి వెళ్ళిపోయింది. ఇది ఇలా ఉంటె.. మరోవైపు ఫ్యామిలీ టైం లో షన్ను మదర్ ఉమారాణి వచ్చినపుడు కూడా దీప్తి గురించి అడిగి షన్ను తెగ ఫీల్ అయిపోయాడు. సమయం కధనం ప్రకారం.. హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా ఉమారాణి దీప్తి గురించి తక్కువే మాట్లాడారు.

deepthi-shannu 2

వారిద్దరూ ప్రేమలో ఉన్న విషయం తమకు ఇంకా చెప్పలేదని.. టివి లో చూసే తెలుసుకున్నామని చెప్పారు. తమకు ఫ్రెండ్ గానే ఆమెను పరిచయం చేసాడని చెప్పారు. దీప్తి కూడా అప్పుడప్పుడు ఇంటికి వస్తుందని, సరదాగా కలిసిపోతుందని చెప్పుకొచ్చారు. ఇక పెళ్లి విషయానికి వస్తే.. ఇప్పటి వరకు ఈ విషయమై రెండు కుటుంబాల మధ్య చర్చ జరగలేదని చెప్పారు.

deepthi-shannu 3

ఇది యూట్యూబ్ కవర్ సాంగ్ కాదని.. పెళ్లి అని.. రెండు కుటుంబాల మధ్య ఇష్టం వుండాలని.. దీప్తి పేరెంట్స్ కి కూడా ఇందుకు సమ్మతం అయితేనే పెళ్లి చేస్తామని చెప్పుకొచ్చారు. షన్ను కు ఇష్టమైతే మాకు కూడా ఇష్టమేనని.. కానీ.. దీప్తి పేరెంట్స్ కి ఈ విషయం తెలుసో లేదో కూడా మాకు తెలియదని అన్నారు. వారికి ఇష్టం లేకుంటే.. ఈ పెళ్లి చేయమని చెప్పారు. ఇరు కుటుంబాలకి సంతోషం ఉండాలని.. అలా అయితేనే ఈ పెళ్లి జరుగుతుందని చెప్పుకొచ్చారు.

Also Read: “బిగ్‌బాస్ తెలుగు”లో ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన 10 కంటెస్టెంట్స్ వీళ్ళే..


End of Article

You may also like