మీ పిల్లల ప్రవర్తనలో ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయా.? అయితే జాగ్రత్త…లేదంటే కష్టమే.!

మీ పిల్లల ప్రవర్తనలో ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయా.? అయితే జాగ్రత్త…లేదంటే కష్టమే.!

by Megha Varna

Ads

నిజానికి పిల్లలు అన్ని విషయాలు తల్లిదండ్రులతో చెప్పరు. ఫ్రీగా వాళ్ళు అన్నిటిని షేర్ చేసుకోవాలి అంటే కొంచెం కష్టమైన పనే. కానీ మీరు వాళ్ళని అర్థం చేసుకుంటూ… వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఇబ్బందుల్ని మీతో సులభంగా పంచుకుంటారు.

Video Advertisement

అప్పుడు మీరు ఆ సమస్య నుండి వాళ్ళను బయటకి తీసుకురావడానికి అవుతుంది. అయితే పిల్లలకు ఏదైనా సమస్య కలిగిందని తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి..? సమస్య కలిగే వాళ్ళ లో ఎలాంటి మార్పు వస్తుంది అనే దాని గురించి మొదట చూద్దాం.

  • ఎప్పుడైనా సరే పిల్లల్లో సడన్ గా ఏదైనా మార్పు వచ్చిందంటే వాళ్లని ఎవరైనా బెదిరిస్తూ ఉండొచ్చు కూడా. వాళ్లను దాడి చేయడం లేదంటే హింసించడం, బెదిరించడం మొదలైనవి ఏమైనా అవ్వచ్చు.
  • ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా కూడా పిల్లల్ని బెదిరిస్తూ ఉంటున్నారు. ఇలా కూడా మీ పిల్లలకి జరిగి ఉండొచ్చు.
  • నిజానికి ఇలాంటివి ఏమైనా జరిగితే పిల్లల్లో మొదట భయం కలుగుతుంది. అది నెమ్మదిగా న్యూనత కి కూడా దారి తీస్తుంది. కాబట్టి మీ పిల్లల ఆహార విషయాల్లో కానీ చదువులో కానీ లేదంటే బిహేవియర్ లో మార్పు ఏదైనా కనపడితే ఇటువంటి వాటికి వాళ్లు గురవుతున్నారని మీరు గ్రహించాలి.
  • అలానే సమస్యను తెలుసుకోవాలంటే ముందు మీరు సమస్య కలిగిందని గుర్తించాలి.

వీటిని పిల్లలకి అలవాటు చెయ్యండి:

  1. మీ పిల్లల్లో ముందు నుండి కూడా ఆత్మ గౌరవం, ఆత్మ విశ్వాసం పెంపొందించాలి.
  2. వాళ్లు ఎంతో ధైర్యంగా, చురుకుగా అన్నిట్లోనూ ఉండేలా చూడాలి.
  3. ఏ సమస్యనైనా వాళ్ళు సాల్వ్ చేసుకున్నట్టు మీరు మార్చాలి.
  4. నిజానికి ఇలా వారిలో ఉండే శక్తిని బయటకు తీయాలి.
  5. వాళ్లని ప్రశంసించడం, అభివృద్ధి చేయడం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం.
  6. అలానే పిల్లలు మనసువిప్పి మాట్లాడేటట్టు మీరు చేయాలి.

ప్రతి విషయంలోనూ వాళ్లని అర్థం చేసుకోవాలి. కేవలం స్ట్రిక్ట్ గా ఉంటేనే పిల్లలు సరిగ్గా ఉండరు. పిల్లలతో మీరూ స్నేహితులతో కూడా వ్యవహరిస్తూ ఉండాలి. మీరు స్నేహపూర్వకంగా వాళ్లతో మెలిగితే వాళ్ళు సెక్యూర్ గా ఫీల్ అవుతారు. ఇలా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి.

ఏమైనా తప్పు చేస్తే వాళ్లు భయపడకుండా దాని నుంచి సొంతంగా బయట పడేలా తల్లిదండ్రులు చెయ్యాలి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులను చెప్పగలరు, ధైర్యంగా ఉండగలరు. చిన్న సమస్య అయితే సొంతంగా బయటపడగలరు కూడా.


End of Article

You may also like