యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌ పై ఆదిత్య చోప్రా నిర్మించిన పఠాన్ సినిమా కి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. జనవరి 25న రిపబ్లిక్ డే కానుకగా ఈ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. నిజానికి కొన్నేళ్ల నుండి షారుఖ్ ఖాన్ కి సరైన హిట్ అందలేదు. మంచి సినిమా కోసం చాలా రోజుల నుండి షారుఖ్ ఎదురు చూస్తున్నాడు. ఒకపుడు మంచి హిట్స్ ని అందుకున్నాడు.

Video Advertisement

కానీ ఇప్పుడు మాత్రం షారుఖ్ ఖాన్ సరైన సినిమాల కోసం అవస్థలు పడ్డాడు. ఫైనల్ గా పఠాన్ సినిమా తో ఈ హీరో హిట్ కొట్టేసాడు.

pathaan movie review

మొన్న మొన్నటి దాకా వచ్చినవి వచ్చినట్టే హిట్ అందుకోకుండా డిజాస్టర్స్ గానే మిగిలిపోతున్నాయి. పఠాన్ సినిమాకి మొదట నుండి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఓటిటి లో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని అంతా చూస్తున్నారు. ఈ సినిమా ఓటిటి లో ఎప్పుడు వస్తుందనేది కూడా తెలిసిపోయింది. ఆ వివరాలని మరి చూసేద్దాం. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. భారీ ధరకు ఈ మూవీ ని కొంది. ఈ సినిమా ఏప్రిల్ 25 నుండి ఓటిటి స్ట్రీమింగ్ కానున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. హిందీ, తెలుగు, తమిళ భాషల లో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.

pathaan movie review

కానీ ఓటిటి లో మాత్రం ఈ మూవీ కన్నడ, మలయాళం భాషలలో కూడా విడుదల కానుంది. ఓటిటి రిలీజ్ పై అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుంది. దీపికా పదుకొనే ఈ మూవీ లో హీరోయిన్ గా చేసింది. విలన్ గా జాన్ అబ్రహం నటించి మెప్పించారు. షారుఖ్ ఖాన్ నటన గురించి చెప్పక్కర్లేదు. యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు షారుఖ్ స్క్రీన్ ప్రెజన్స్ ఇవన్నీ కూడా మూవీ కి ప్లస్ అయ్యాయి. దీపికా గ్లామర్ గురించి చెప్పాల్సిన పనే లేదు. అలనే సల్మాన్ ఖాన్ స్పెషల్ అప్పీయరెన్సు కూడా అందరికీ నచ్చింది.