‘బ్రో’ మూవీ కి “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్” రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..??

‘బ్రో’ మూవీ కి “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్” రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..??

by Anudeep

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ‘వినోదయ సీతమ్’ అనే తమిళ సినిమాను తెలుగులో ‘బ్రో’ అనే పేరుతో రీమేక్‌‌‌ చేస్తున్నారు. మంచి కంటెంట్‌తో వచ్చి తమిళ్‌లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తెలుగులో సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Video Advertisement

 

 

ఇది రీమేక్ అయినప్పటికీ ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. మరో వైపు త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందించడం వల్ల కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా నుండి మొన్న మేకర్స్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేసిన విషయం తెలిసిందే. ”బ్రో” అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు మోషన్ పోస్టర్ ద్వారా తెలిపారు.

pavan kalyan remunaration for 'bro' movie..!!

ఈ పోస్టర్ మొత్తంగా 24 గంటల్లోనే 11 మిలియన్ వ్యూస్ అందుకున్నట్టు మేకర్స్ తెలిపారు. మరో వైపు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 85 కోట్ల బిజినెస్ చేయగా కర్ణాటక, ఓవర్సీస్ కలిపి 15 కోట్ల బిజినెస్ చేసిందట. మొత్తంగా ఈ సినిమా 100 కోట్ల బిజినెస్ అయితే చేసినట్టు సమాచారం. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చింది. సమాచారం ప్రకారం ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ పాత్ర కేవలం 15 నిముషాలు మాత్రమే ఉంటుందట.

pavan kalyan remunaration for 'bro' movie..!!

ఇదే నిజమైతే 15 నిముషాలు కనిపించే పవన్ వల్ల 100 కోట్ల బిజినెస్ జరిగిందని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం పవన్ కి ఉన్న మార్కెట్ ప్రకారం ఆయనకి సినిమాకి రూ.100 కోట్లు పైనే రెమ్యూనరేషన్ ఇస్తారనే టాక్ ఉంది. అయితే ‘వినోదయ సీతమ్’ రీమేక్‌లో ఆయన పాత్ర నిడివి తక్కువే కావడంతో పాటు.. పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ వల్ల కేవలం కేవలం 15-20 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారట. ఈ 15-20 రోజులకు గానూ రూ.50 కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తున్నారనేది లేటెస్ట్ అప్డేట్.

 

pavan kalyan remunaration for 'bro' movie..!!
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్‌ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో పవన్, సాయితేజ్‌లతో పాటు ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం కీలక పాత్రలు చేస్తున్నారు.


End of Article

You may also like