ఇంటర్ లోనే ఎదురింటి అబ్బాయికి లైన్ వేసిన నదియా.. ఈ సీరియస్ అత్తకు ఇంత లవ్ స్టోరీ ఉందా..?

ఇంటర్ లోనే ఎదురింటి అబ్బాయికి లైన్ వేసిన నదియా.. ఈ సీరియస్ అత్తకు ఇంత లవ్ స్టోరీ ఉందా..?

by Anudeep

Ads

అమ్మా, అత్తా పాత్రలు కాటన్ చీరతో, కష్టాలు కన్నీళ్లతో మనసును బరువెక్కించేలా కాకుండా మోడ్రన్ లుక్ తో, ట్రెండీ దుస్తులతో, ఆధునిక అమ్మ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ నదియా.

Video Advertisement

మిర్చీ, అత్తారింటికి దారేది చిత్రాలతో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన నదియా ఇంటర్ లోనే లవ్ లో పడ్డారట. ఆమె రియల్ లైఫ్ లవ్ స్టోరీ విన్న ప్రేక్షకులు.. తెరపై ఇంత సీరియస్ గా కనిపించే నదియాకు అంత చిన్న వయసులో లవ్ స్టోరీ ఉందా! అంటూ ఆశ్చర్యపోతున్నారు.

 

మలయాళ దర్శకుడు ఫాజిల్ నటి నదియా ఫ్యామిలీ ఫ్రెండ్. ఓ సారి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నదియాను చూశారట. తర్వాత మోహన్ లాల్ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. మీ అమ్మాయి ఆ పాత్రకు సరిపోతుంది అని ఫాజిల్ అడిగారట. నదియా నాన్నగారు ఆమెను ఒప్పించి ఆడిషన్స్ కి తీసుకెళ్లారట. అలా ఆ మూవీ హీరోయిన్ గా నదియా ఎంపికయ్యారు.

1984లో విడుదలైన మలయాళ చిత్రం నొక్కేతధూరతు కన్నుం నట్టు సూపర్ హిట్.. ఆ చిత్రానికి నదియా ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకున్నారు. దీంతో మలయాళ, తమిళ భాషల్లో ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఇంటికెదురుగా ఉండే శిరీష్ గాడ్బోలేని నదియా ఇష్టపడ్డారట. శిరీష్ లక్ష్యం చదువు పూర్తి చేసి విదేశాల్లో స్థిరపడాలి. అందుకోసం నదియా తన లక్ష్యం త్యాగం చేసిందట.

శిరీష్ ఉద్యోగంలో స్థిరపడ్డాక పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనేది నదియా ఆలోచన. ఫైనల్ గా శిరీష్ కి అమెరికాలో ఉద్యోగం రావడంతో ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పి పెళ్ళికి ఒప్పించారు. 1988లో శిరీష్-నదియా వివాహం జరిగింది. శిరీష్ తో పెళ్లి కుదిరాక సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న మైనే ప్యార్ కియా చిత్రంలో అవకాశం వచ్చిందట. మంచి ఆఫర్… చేయాలా? వద్దా? అనే సందిగ్ధత ఏర్పడింది.

పెళ్లి మేటర్ ఏదైనా తేడా కొడితే పరిస్థితులు దారుణంగా మారతాయని, నదియా చేయనని చెప్పేశారట. మైనే ప్యార్ కియా ఎంత పెద్ద బ్లాక్ బస్టరో తెలిసిందే. సినిమా జీవితం వదిలేసిన నదియాకు దర్శకుడు ఎం రాజా అమ్మానాన్న తమిళ అమ్మాయి తమిళ్ రీమేక్ లో జయసుధ పాత్ర ఆఫర్ చేశారు. అదే విషయాన్ని భర్తకు చెప్పగా… నా కోసం చాలా చేశావు. ఇకపై నీకు ఇష్టమైన సినిమాల్లో నటించమన్నారట.

అలా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యింది. తెలుగులో హీరోయిన్ గా బజార్ రౌడీ, ఓ తండ్రి ఓ కూతురు చిత్రాలు చేసిన నదియా.. ఇటీవల గని, సర్కారు వారి పాట, అంటే సుందరానికీ చిత్రాల్లో నటించారు. రామ్ పోతినేని ది వారియర్ మూవీలో నదియా కీలక రోల్ చేశారు.


End of Article

You may also like