“సీఎం పదవి వద్దు అని నేను చెప్పలేదు..!” అంటూ… “పవన్ కళ్యాణ్” కామెంట్స్..!

“సీఎం పదవి వద్దు అని నేను చెప్పలేదు..!” అంటూ… “పవన్ కళ్యాణ్” కామెంట్స్..!

by Mounika Singaluri

Ads

పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల వైపు టర్నయ్యారు. టైం గ్యాప్ లో సినిమాలు చేస్తున్నా కూడా అతని దృష్టి అంతా రాజకీయాల మీదే ఉంది. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జనసేన గోర పరాజయం పొందిన తర్వాత కూడా ఆయన ఎక్కడ వెనకడుగు వేయలేదు.

Video Advertisement

నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ జనసేన పార్టీని ప్రజల్లోనే ఉంచారు. అదే ఇప్పుడు జనసేన పార్టీకి ప్లస్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో ఆటోమేటిక్ గా జనసేన పార్టీ గ్రాఫ్ పెరిగింది. ఇప్పుడు 2024 ఎన్నికలు సమీపించడంతో పవన్ కళ్యాణ్ జనసేన విజయకేతనం బలంగా ఉండే విధంగా అసెంబ్లీలో ఉండి పని చేయాలనే ఆత్రుతతో కసిగా కనిపిస్తున్నారు. తాజాగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో తెలుగుదేశంతో పొత్తు ప్రకటించి అధికార వైసీపీకి పెద్ద షాక్ నే ఇచ్చారు.ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూరా తిరుగుతున్నాయి. తాజాగా ఆయన జనసేన నాయకులతో మంగళగిరిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ… తెలుగుదేశంతో మనం కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, కేవలం జనాధారనతోనే ఇంతవరకు జనసేన నడిచిందని అన్నారు. ఆరున్నర లక్షల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారని, ప్రజల భవిష్యత్తును బంగారమయం చేసే విధంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి పోవాలి, జనసేన-టిడిపి ప్రభుత్వం ఏర్పడే విధంగా ముందుకు వెళ్దాం అన్నారు. “సీఎం స్థానం వద్దని నేను ఎప్పుడూ చెప్పలేదు.కానీ దానికోసం వెంపర్లాడను, నాకు సీఎంగా అవకాశం వస్తే తప్పకుండా తీసుకుంటాం. ప్రజల కోసం ఆదర్శ పాలన అందిద్దామని” పవన్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఈ ప్రకటనతో జనసేన నాయకుల్లోనూ, జనసైనికుల్లోనూ ఫుల్ జోష్ వచ్చింది.

వచ్చే ఎన్నికల్లో వచ్చేది జనసేన- తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే తీరతారని, పవన్ కళ్యాణ్ ని సీఎంగా చూడడమే తమ లక్ష్యమని దానికోసం సాయి శక్తుల కృషి చేస్తామని ప్రకటించారు. ఈ జోరు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే ఎన్నికల హడావిడి మొదలైందని ప్రజలనుకుంటున్నారు

Also Read:ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబును అప్పటివరకు అరెస్టు చేయొద్దు.. సుప్రీంకోర్టు..!


End of Article

You may also like