“బ్రో” మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూలు చేసిందంటే..?

“బ్రో” మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూలు చేసిందంటే..?

by kavitha

Ads

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ వింటేజ్ పవన్ ను చూసి అభిమానులు  ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

Video Advertisement

బ్రో మూవీకి సముద్రఖని దర్శకత్వం వహించగా, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. పవన్ కళ్యాణ్ మూవీ అంటే బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు ఎలా ఉంటాయో తెలిసిందే. మరి బ్రో మూవీ మూడు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. మెగా ఫ్యామిలీ హీరోలు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఇద్దరు కలిసి నటించిన ‘బ్రో’ మూవీ కోసం అటు మెగాఫ్యాన్స్  తో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సీతమ్’ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ మూవీని నిర్మించింది. థమన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించాడు. జులై 28న రిలీజ్ అయిన ఈ చిత్రానికి తొలి రోజు రూ. 30.05 కోట్ల భారీ కలెక్షన్స్ సంపాదించింది. కానీ రెండవ రోజు కొంచెం కలెక్షన్స్ వసూళ్లు తగ్గినట్టుగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రెండవ రోజు రూ.27 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ. 50 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యింది. ఇక ఆదివారం కలెక్షన్స్ పెరుగుతాయని అంతా అనుకున్నారు.bro-movieఅయితే తెలుగు స్టేట్స్ లో రూ. 11 – 11.50 కోట్ల షేర్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 13 – 14 కోట్ల షేర్ రాబట్టిందని తెలుస్తోంది. మూడు రోజుల్లో బ్రో మూవీ రూ. 56 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ విజయం సాధించాలంటే ఇంకా రూ. 42 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాలని తెలుస్తోంది.

Also Read: ఈ ఫోటోలో ఉన్న హీరోకి సౌత్ ఇండియా అంతా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు..! ఎవరో తెలుసా..?


End of Article

You may also like