జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి గుణం గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో సాయాలు చేస్తూ ఉంటారు గానీ అవన్నీ బయటికి రావు. ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు కానీ వాటి గురించి ఎక్కడా చెప్పరు. పవన్ కళ్యాణ్ కి పుస్తకాలు అంటే పిచ్చి అన్న విషయం తెలిసిందే. ఖాళీగా ఉంటే చాలు పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఇప్పటివరకు ఎన్నో రకాల పుస్తకాలు, ఎన్నో మాండలికలకు సంబంధించిన పుస్తకాలు చదివారు. తెలుగు లిటరేచర్ అంటే పవన్ కళ్యాణ్ కి అమితమైన ఇష్టం. అది అక్కడక్కడ తన సినిమాల్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది.
తాజాగా పవన్ కళ్యాణ్ ప్రముఖ కది గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఆధునిక మహాభారతం పుస్తకానికి ఆర్థిక సహాయాన్ని అందజేసి దాన్ని రీప్రింట్ చేయించారు.ఈ పుస్తకం ముందు పేజీలో పవన్ కళ్యాణ్ రాసిన లెటర్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మే 18 2016 న తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఈ లెటర్ రాసినట్లుగా ఉంది. ఆధునిక మహాభారతం పుస్తకం చదివి తాను ఎంత ఇన్స్పైర్ అయ్యారు అనేది ఈ లెటర్ ద్వారా తెలియజేశారు.
పూర్తి విషయంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ కి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఆధునిక మహాభారతం పుస్తకాన్ని త్రివిక్రమ్ బహుమతిగా అందించారు. అయితే పుస్తకం తనని ఎంతగానో ఆకట్టుకున్నందుకు ఆ పుస్తకాన్ని మళ్లీ రీప్రింట్ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. అనుకున్నదే తడవుగా గుంటూరు శేషేంద్ర కుమారుడి సహకారాన్ని తీసుకున్నారు.
25 వేల కాపీల పుస్తకాలు ముద్రించేందుకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తనకి ఇంత గొప్ప కవిని పరిచయం చేసినందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలిపారు.పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.పవన్ కళ్యాణ్ ఆధునిక మహాభారతాన్ని ఎంతలా వంట పట్టించుకున్నారంటే తన రాజకీయ ప్రసంగాల్లో ప్రతి చోట గుంటూరు శేషేంద్ర శర్మ చెప్పిన మాటలను తన స్పీచ్ లో వినిపిస్తూ ఉంటుంది.
Also Read:మాటల మాంత్రికుడు “త్రివిక్రమ్ శ్రీనివాస్” చెప్పిన 8 జీవిత సత్యాలు..!