పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలలో నటిస్తున్నారు. వాటిలో కొన్ని చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. వాటిలో ‘బ్రో’ చిత్రం ఒకటి. ఈ చిత్రానికి నటుడు డైరెక్టర్ అయిన సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. వినోదయ సీతమ్ అనే కోలీవుడ్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
Video Advertisement
వినోదయ సీతమ్ ఈ మూవీ తమిళంలో సూపర్ హిట్ గా నిలిచింది. ‘బ్రో’ మూవీలో పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ నటిస్తున్నారు. ఈ మూవీ శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దాదాపు షూటింగ్ పూర్తయింది. అయితే పవన్ కళ్యాణ్ ఈ డైరెక్టర్ కి మరో అవకాశం ఇస్తున్నాడని తెలుస్తోంది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా జూలై 27, 2023న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ సంబంధించిన పనులను మొదలు పెట్టింది. ఈ విషయం పై మేకర్స్ ప్రకటన కూడా చేశారు.
ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్, సముద్రఖనితో మరో సినిమా చేయనున్నట్లు సమాచారం. బ్రో సినిమా షూటింగ్ లో సముద్రఖని టేకింగ్, వేగానికి పవన్ ఫిదా అయ్యడంట. అది మాత్రమే కాక ఈ మూవీలో పవన్ నటించే పోర్షన్ ను స్పీడ్ గా పూర్తి చేశాడట.
సముద్రఖని స్కిల్స్ నచ్చిన పవన్ కళ్యాణ్ సముద్రఖనితో మరోసారి సినిమా చేబోతున్నట్లు తెలుస్తోంది. బ్రో మూవీ రిలీజ్ అయిన తరవాత ఆ సినిమా మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈసారి రీమేక్ కాకుండా స్ట్రెయిట్ కథతో మూవీ చేయబోతున్నారని అంటున్నారు. ఈ మూవీ గురించి త్వరలో అఫిషియల్ ప్రకటన రానున్నట్లు సమాచారం.
Also Read: VIMANAM REVIEW : “సముద్రఖని, మీరా జాస్మిన్” నటించిన విమానం ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!