సాధారణం గా మన ప్రేమను మనం ప్రేమించిన వారు అంగీకరిస్తే ఎంతో మురిసిపోతాం. కానీ, మనలని కూడా అంతే గొప్ప గా ప్రేమించే వారు దొరకడం మన అదృష్టం. అయితే, ఎవరైనా మనపై పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని మనకి ఎలా తెలుస్తుంది..? ప్రేమ లో పడితే అదే తెలుస్తుంది అండి. ఈ పది లక్షణాలు ఎవరిలో అయినా మీకు కనిపించాయా..? అయితే.. ఆ అబ్బాయి మీ పై పీకల్లోతు ప్రేమ లో మునిగిపోయాడని అర్ధం. అవేంటో చూడండి..

Video Advertisement

సాధారణం గా అబ్బాయిలకి సానిటరీ పాడ్స్ కొనడం లాంటివి ఇష్టం ఉండవు. ఇవి కొంటున్న సమయం లో అతని స్నేహితులెవరైనా చూస్తే తమ పరువు పోతుందని చాలా మంది అబ్బాయిలు భావిస్తారు. కానీ, మీకోసం ఎవరైనా అబ్బాయి అలా కొని తెచ్చ్చిపెట్టారంటే అతనికి మీరంటే చాలా పిచ్చి ప్రేమ అని అర్ధం.

boy loves girl

1. జనరల్ గా అబ్బాయిలు ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే ఓసారి కనబడి పలకరించి వచ్చేస్తారు.అంతే తప్ప..అమ్మాయిల్లా పక్కనే ఉండి ఎక్కువ కేర్ తీసుకోవడం వంటివి ఉండవు. కానీ, మీకెప్పుడైనా అనారోగ్యం వస్తే.. ఎవరైనా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారా..? అంటే ఆ అబ్బాయికి మీపై పిచ్చి ఇష్టం ఉన్నట్లే.

2.మీరు మాట్లాడుతున్నప్పుడు.. మీరు చెప్పే విషయాలన్నీ వారికి బాగా గుర్తుంటాయి. వారు మీ మాటల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. కాబట్టి మీరు చెప్పే విషయాలు కూడా వారికీ బాగా గుర్తుంటాయి.

boy loves girl 2

3. మిమ్మల్ని సెక్యూర్ గా ఉంచడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. సాధారణం గా అబ్బాయిలు ఇలాంటి విషయాలు పట్టించుకోరు. ఎవరిదీ వారు చేసుకోగలరు అన్న మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అయినా మీ పట్ల ఈ ప్రత్యేకత కనబరుస్తున్నారంటే.. మీరంటే వారికి ప్రేమ ఉన్నట్లే.

4. మీతో పాటు కలిసి సీరియల్స్ చూడడానికి ఆసక్తి కనబరిస్తే.. వారి కి మీతో గడపడం ఇష్టమన్న సంగతి అర్ధం అవుతూనే ఉంటుంది. సాధారణం గా అబ్బాయిలకి సీరియల్స్ చూడడం ఇష్టం ఉండదు. మీతో గడపడం కోసమే వారు సీరియల్స్ చూడడానికి ఇష్టపడతారు.

5. ఇంట్లో ఉండే పనిని మీతో పాటు వారు కూడా పంచుకుంటారు. బాత్రూం క్లీనింగ్ నుంచి, వంట పనుల దాకా అన్ని పనుల్లోనూ మీకు సహకరిస్తారు.

6. మీ పై చాలా ప్రేమ ఉన్న అబ్బాయిలు మీతో ప్రేమ గానే ఉంటారు. కానీ రోజువారీ వారు చేస్తున్న పనులను, వారు ఎదుర్కొంటున్న కష్టాలను మీతో గడుపుతున్న సమయం లో మర్చిపోతారు. వారి కష్టాలను మీకు తెలియనివ్వరు.

boy loves girl 5

7. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు పెట్టుకోవడం. నిజం గా ప్రేమ ఉన్న వ్యక్తులు మాత్రమే మీతో ఓపెన్ గా నిజాయితీ గా ఉంటారు. చిన్న చిన్న గొడవలు వచ్చినా.. మీకు మరింత దగ్గరవుతారు.

8. ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని సలహా అడుగుతుంటారు. అంటే వారికీ చేతకాక కాదు.. మీరంటే ఎక్కువ ఇష్టం ఉండడం వలన.. మీ అభిప్రాయాలకు ఎక్కువ గౌరవం ఇవ్వడం కోసమే మిమ్మల్ని అడుగుతూ ఉంటారు.

boy loves girl 4

9. సమయం దొరికినపుడు సరదాగా బయటకు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కూడా బయటకు తీసుకెళ్తుంటారు. రెస్టారంట్స్, షికార్లకు తాను వెళ్లాలనుకుంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్లాలని భావిస్తారు.

10. తన పనులకంటే.. మీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. తనకి పనులు ఉన్నా, మీకు ప్రాధాన్యత ఇస్తున్నారంటే మీరంటే పడి చచ్చేంత ఇష్టం ఉందని అర్ధం.