ఈమె నటిస్తుంటే పిచ్చిదని అనుకుని పట్టుకున్నారట..కానీ ఆఖరికి..?

ఈమె నటిస్తుంటే పిచ్చిదని అనుకుని పట్టుకున్నారట..కానీ ఆఖరికి..?

by Megha Varna

Ads

ఇప్పుడంటే షూటింగులు అందరికీ బాగా అలవాటు అయిపోయాయి. ఎక్కడైనా షూటింగ్ జరుగుతున్న సరే చాలా తక్కువ మంది మాత్రమే రియాక్ట్ అవుతూ ఉంటారు. అయితే ఒకప్పుడు ప్రజలకి నిజానికి షూటింగ్ అంటే ఏమిటో కూడా తెలియదు.

Video Advertisement

తెలిసిన వాళ్ళు మాత్రం ఎడ్ల బండి మీద వచ్చి షూటింగ్ ని చూసే వారు అయితే నటీ నటులకి మంచి యాక్టింగ్ వస్తేనే ఇండస్ట్రీలో స్థిరపడగలరు. పాత్రల్ని అద్భుతంగా చేసి మెప్పిస్తే గుర్తింపు తప్పక వస్తుంది.

Also Read:   ఆ ఎన్టీఆర్ సినిమాకి…హలో బ్రదర్ సినిమాకి మధ్య ఉన్న లింక్ ఏంటో మీకు తెలుసా.?

అయితే అప్పటి రోజుల్లో జరిగిన షూటింగ్ లో ఒక విచిత్రం జరిగింది. ఆ నటిని ఏకంగా పిచ్చిదాని అనుకున్నారు అక్కడి ప్రజలు. ఇక అసలు ఏమైంది అనేది చూస్తే… 1938లో హెచ్.ఎం.రెడ్డి గృహ లక్ష్మి అనే సినిమాను తీశారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కన్నాంబ నటించారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కన్నాంబ సీన్ లో ”దేవుడు లేడు..సత్యం జయించదు” అని అరవాలి.

అలానే వీధుల్లో పరిగెట్టాలి. షూటింగ్ లో ఈమె పాత్రకి లీనమైపోయి పిచ్చి దానిలా రోడ్డు మీద పరిగెత్తడం మొదలు పెట్టారు. మద్రాసు జార్జ్ టౌన్ వీధుల్లో ఈ సినిమాని షూట్ చేయడం జరిగింది. అయితే ఆమె ఆ వీధిల్లో కార్లని, బండ్లను తప్పించుకుని పరిగెడుతూ పిచ్చి దానిలా తిరుగుతూ ఉంటారు.

కెమెరా మ్యాన్ ఏమో ఆమె చేసే సీన్లు షూట్ చేస్తున్నారు. కానీ అక్కడ చుట్టు పక్కల ప్రజలు వచ్చేసి ఆమె నిజంగా పిచ్చి అనుకున్నారు. కెమెరాని కూడా గమనించ లేదు. ఆమె బండి కింద పడి పోతుందేమో అని భయపడి ఆమెని ఆపేశారు. తర్వాత ఆమెను ఒక పక్కన కూర్చోబెట్టారు. దీంతో ఆమె గట్టిగా నవ్వి ఇది సినిమా షూటింగ్ అని చెప్పారు.

Also Read: “బింబిసార” సినిమాకి… ఈ 2 విషయాలే మైనస్ అయ్యాయా..?


End of Article

You may also like