Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే మొట్టమొదట గుర్తు వచ్చే వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్ గారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి కృషి చేసిన వారిలో మొదటి వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఎన్నో రకమైన సినిమాలు. ఎన్నో రకమైన పాత్రలు. నటన మాత్రమే కాకుండా ఇంక ఎన్నో విషయాల మీద పరిజ్ఞానం. వాటన్నిటిలో సక్సెస్ అవ్వడం. ఇవన్నీ కేవలం ఎన్టీఆర్ గారికి మాత్రమే సాధ్యం అయ్యాయి ఏమో. సినిమా ఇండస్ట్రీని మద్రాస్ నుండి హైదరాబాద్ కి తీసుకు రావడానికి కూడా ఎన్టీఆర్ గారు ముఖ్య పాత్ర పోషించారు.
Video Advertisement
ఒక నటుడికి సినిమాలో ఎంత మంది అభిమానులు ఉన్నారో, తెర వెనుక కూడా అంతే మంది అభిమానులు ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఎన్టీఆర్ గారి విషయంలో ఇలాగే జరిగింది. ఎన్టీఆర్ గారికి ఆయన నటనకి ఎంత మంది అభిమానులు ఉన్నారో, ఆయన వ్యక్తిత్వానికి కూడా అంతే మంది అభిమానులు ఉన్నారు. అంతగా అభిమానించే ప్రజల కోసం ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వెళ్లి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేశారు. ఈ పైన ఫోటోలో ఎన్టీఆర్ గారితో పాటు ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరో కొంత మందికి తెలిసి ఉంటుంది. ఆయన ఎన్టీఆర్ గురించి ఏ విధంగా చెప్పారో ఇప్పుడు అలాగే జరిగింది.
ఈ సంఘటనని కోరాలో, వెంకటరమణ సూరంపూడి గారు షేర్ చేశారు. లవకుశ సినిమా షూటింగ్ సమయంలో ఈ సంఘటన జరిగింది. సినిమా ముహూర్తం రోజు ముహూర్తం షాట్ ని చిత్రీకరించాలి అని డైరెక్టర్ పుల్లయ్య గారు అనుకున్నారు. శ్రీరాముడిగా నటిస్తున్న ఎన్టీఆర్ గారికి అలంకరణ చేశాక దర్శకుడు కెమెరా స్టార్ట్ అన్నారు. ఎన్టీఆర్ గారు నడిచి వస్తున్నప్పుడు కట్ చెప్పారు. ఫ్లోర్ అంతా కూడా చప్పట్లు కొట్టారు. అప్పుడు హాస్యనటుడు రేలంగి గారు ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి కౌగిలించుకొని, “సాక్షాత్తు శ్రీ రామ చంద్రుడిలా ఉన్నావు. తెలుగు చిత్ర పరిశ్రమలో నీకిక ఎదురులేదు. పౌరాణిక నటుడిగా జేజేలు అందుకుంటావు..” అని చెప్పారట.
రేలంగి గారికి హస్త సాముద్రికంలో చాలా మంచి పట్టు ఉంది. దాంతో చేయి చూపించమని అడిగి, “ఏదీ చెయ్యి చూపు. అబ్బో! నీకు 50 ఏళ్లు దాటిన తర్వాత భారత దేశం గర్వించే గొప్ప జాతకుడవు అవుతావు. అప్పుడు నన్ను గుర్తు పెట్టుకో” అని చెప్పారట. అక్కడే ఉన్న దర్శకుడు పుల్లయ్య గారు, నటి అంజలీ దేవి గారు కూడా తథాస్తు అని అన్నారట. ఆ సమయంలో తీసిన ఫోటోనే ఇది. ఆయన చెప్పినట్టే ఇప్పుడు జరిగింది. ఎన్టీఆర్ గారు ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ALSO READ : సీఐ తిట్టడంతో రాజీనామా చేశాడు… ఇప్పుడు ఏకంగా కలెక్టర్ అయ్యాడు..! ఇతను ఎవరో తెలుసా..?
End of Article