విడాకుల తర్వాత మొదటిసారి టీవీలో కనిపించబోతున్న సమంత.! వైరల్ అవుతున్న ఫోటో.!

విడాకుల తర్వాత మొదటిసారి టీవీలో కనిపించబోతున్న సమంత.! వైరల్ అవుతున్న ఫోటో.!

by Mohana Priya

Ads

సోషల్ మీడియా వేదికగా నాగ చైతన్య, సమంత విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సమంత కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇంటి పేరు తీసేయడం, ఈ విషయంపై ఇంటర్వ్యూలో అడిగినా కూడా, “నేను సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి స్పందిస్తాను” అని చెప్పడం తో వారిద్దరూ విడిపోయారని సోషల్ మీడియాల్లో వార్తలు గుప్పుమన్నాయి. అక్టోబర్ రెండవ తేదీన నాగ చైతన్య, సమంత ఇద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

Video Advertisement

విడాకుల తర్వాత సమంత మొట్టమొదటిసారిగా తెరపై కనిపించబోతున్నారు. అది ఏ సినిమాలోనో కాదు. ఒక షో ద్వారా. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి సమంత అతిథిగా రాబోతున్నారు. ఈ షోలో సమంత 25 లక్షల రూపాయలు గెలుచుకున్నట్లు సమాచారం. సమంత ఎవరు మీలో కోటీశ్వరులు ఎపిసోడ్ షూటింగ్ ఇవాళ పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఒక పిక్చర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

picture of samantha post divorce going viral

ఈ ఫోటోలో సమంత ప్రముఖ ప్రొడ్యూసర్ మహేంద్ర బాబుతో ఉన్నారు. ఈ ఎపిసోడ్ దసరా సందర్భంగా టెలికాస్ట్ అవుతుంది అని సమాచారం. దసరా సందర్భంగా ఎవరు మీలో కోటీశ్వరులు షోకి కొంత మంది ప్రముఖులు అతిథులుగా రాబోతున్నారు. వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నారు. అదే వారంలో సమంత ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ అవుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. సమంత తెలుగులో ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా సైన్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా, తమిళ్ లో కూడా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రొడక్షన్ లో ఒక సినిమా సైన్ చేశారు. అటువైపు నాగ చైతన్య కూడా అఖిల్ అక్కినేని హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాబోతున్నారు.


End of Article

You may also like