Ads
ప్రస్తుతం విద్యా వ్యవస్థ ఎంత కమర్షియల్ గా మారిందో అందరికీ తెలిసిందే. గవర్నమెంట్ స్కూల్స్ పక్కన పెడితే, ప్రైవేటు స్కూల్స్ లో అడ్మిషన్, డొనేషన్లు అంటూ లక్షల్లో వసూలు చేస్తున్నారు. కొన్ని స్కూల్స్ లో నర్సరీ నుండే స్కూల్ ఫీజును లక్షల్లో వసూలు చేస్తున్నారు.
Video Advertisement
అయితే ఒక ప్రైవేటు స్కూల్ ఇందుకు భిన్నంగా స్కూల్ ఫీజును వసూలు చేస్తున్నారు. ఆ ఫీజు పిల్లలకు కానీ, వారి తల్లిదండ్రులకు కానీ ఏమాత్రం కష్టం కాదు. మారి ఆ స్కూల్ ఎక్కడుందో, వారు వసూలు చేస్తున్న ఫీజు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఆ స్కూల్ పేరు అక్షర, అస్సాం రాష్ట్రంలో ఉంది. స్కూల్ యాజమాన్యం ఫీజుగా వసూలు చేస్తున్నది డబ్బుని కాదు. ప్లాస్టిక్ ను మాత్రమే. అస్సాంలోని పామోహిలో అక్షర స్కూల్ ఉంది. ఈ స్కూల్ ని 2016లో మజిన్ ముఖ్తార్, పరిమిత శర్మ అనే జంట స్థాపించారు. ఆ ప్రాంతంలో ఈ జంట చెత్త, నిరక్షరాస్యత అనే రెండు సమస్యల గుర్తించారు. అక్కడ జీవించేవారు ఎక్కువగా క్వారీల్లో పని చేస్తారు. దాంతో స్కూల్ ఫీజులు కట్టడం వారికి కష్టం కావడంతో తమ పిలల్లను స్కూల్ కి పంపేవారు కాదు.
అలాగే అక్కడ ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండడంతో ఈ రెండు సమస్యలకు ఒకే పరిష్కారం కోసం స్కూల్ ను మొదలుపెట్టారు. పిల్లల ఫీజులగా ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకువచ్చేలా , అది కూడా ప్రతి వారం స్టూడెంట్స్ 25 ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి, తీసుకురావాలని ఒక కండీషన్ పెట్టారు. అలా పిల్లలకు ఉచిత విద్యను భోధిస్తూ, వారు సేకరించిన ప్లాస్టిక్ బాటిళ్లను రోడ్లు, ఇటుకలు, మరుగుదొడ్ల నిర్మాణంలో ఉపయోగిస్తారట.
అంతే కాకుండా ఇక్కడ స్టూడెంట్స్ కు నైతిక విలువలతో పాటుగా చెత్త, ప్లాస్టిక్ రీ సైక్లింగ్ మరియు గార్డెనింగ్ వంటివి కూడా బోధిస్తున్నారు. దీంతో పాఠశాల డ్రాపౌట్ రేటు చాలా తగ్గిపోయింది. ఈ స్కూల్ ఆర్థికంగా వెనుకబడిన వందలాది స్టూడెంట్స్ కు మంచి విద్యను అందిస్తోంది. ఈ స్కూలు వీడియోను నాగాలాండ్ మినిస్టర్ టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో షేర్ చేయడంతో వార్తల్లో నిలిచింది.
End of Article