Ads
జీవితం అనేది ఒక నవ లాంటిది. నవ ప్రయాణిస్తూ ఒడ్డుకు చేరేవరకు ఆటుపోట్లను ఎలా తట్టుకుంటుందో అలాగే మన జీవితంలో కూడా ఎన్నో కష్టసుఖాలు వస్తుంటాయి. కానీ కష్టాలు ఎక్కువైనప్పుడు ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో పడుతుంటాం. ఇప్పుడు నాకు అలాంటి పరిస్థితి ఏర్పడింది. నాకు ఏర్పడిన ఈ స్థితిని చూసి మీరే సరైన సమాధానం ఇవ్వగలరు అని భావిస్తున్నాను. సరైన సమాధానం ఇచ్చిన ఈ అయోమయ స్థితి నుంచి బయటపడేగలరని కోరుకుంటున్నాను.
Video Advertisement
నాకు ఎంబీబీఎస్ చదువు పూర్తయిన వెంటనే పెళ్లి అయిపోయింది. నా పెళ్లి జరిగి ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలు గడిచింది. అతనికి మంచి ఉద్యోగం ఉందని వివరాలు తెలుసుకోకుండా మా తల్లిదండ్రులు అతనికి ఇచ్చి పెళ్లి చేసేసారు. ఆయనకు ఇంతకుముందే పెళ్లయింది. నాతో జరిగిన వివాహం రెండో వివాహం. నాకు ముగ్గురు ఆడపడుచులు ఉన్నారు. వాళ్లు నా భర్తకు లేనిపోనివన్నీ చెప్పి నన్ను తిట్టిస్తుంటారు. వాళ్ళ మాటలు నమ్మి ఆయన నన్ను బయట వ్యక్తుల చూస్తుంటాడు
ఇవి కూడా చదవండి: ఈ 10 “చెడు అలవాట్లు” నిజానికి మంచి చేస్తాయని తెలుసా..? అవేంటంటే..?
అతను అనే మాటలకు నాకు ఒక్కోసారి చనిపోవాలని ఉంటుంది. మాకు ఒక బాబు ఉన్నాడు. బాబు భవిష్యత్తును ఆలోచించి నా నిర్ణయాన్ని విరమించుకున్నాను. అలా అని విడాకులు తీసుకునే ధైర్యం నాకు లేదు. ఇంత చిన్న వయసులోనే మా బాబు నా సమస్యని గ్రహించి మీ వలనే మా అమ్మ నాన్న గొడవ పడుతున్నారు అని మా ఆడపడుచులను తిట్టడం మొదలుపెట్టాడు.
దీంతో మా ఆడపడుచులు మాకు దూరమయ్యారు. ఇదంతా నీ వల్లే జరుగుతుంది అంటూ ఆయన నన్ను మళ్లీ హింసించడం మొదలుపెట్టారు. చదువు పూర్తయిన వెంటనే పెళ్లి చేసుకోవడంతో బయటకు వెళ్లి ఉద్యోగం చేయాలన్న నాకు భయం వేస్తుంది. తనతో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందో అని. తెగించి బయటికి వెళ్ళలేను. కానీ నరకంలో బ్రతకలేకపోతున్నాను. ఈ నా సమస్యకు మీరే సరైన పరిష్కారం ఇవ్వగలరని భావిస్తున్నాను.
ఇవి కూడా చదవండి: చనిపోతున్న తన భార్య చివరి కోరిక తీర్చిన భర్త..రియల్లీ హ్యాట్సాఫ్.! ఇంతకీ ఆమె ఏం కోరిందంటే.?
End of Article