నా జీవితంలో పెళ్ళయ్యాకా ఇలా జరిగింది.. ఇప్పుడు నా కొలీగ్ ని రెండో పెళ్లి చేసుకోవచ్చా? నాకేమి సలహా ఇస్తారు?

నా జీవితంలో పెళ్ళయ్యాకా ఇలా జరిగింది.. ఇప్పుడు నా కొలీగ్ ని రెండో పెళ్లి చేసుకోవచ్చా? నాకేమి సలహా ఇస్తారు?

by Anudeep

Ads

మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఒకసారి దెబ్బతిన్న తర్వాత ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయాలి. మన గతం అనేది ఎప్పుడూ ఇతరులకు ఇబ్బంది గా మారకూడదు. ఇలాంటి ప్రశ్నే నా జీవితంలో ఎదురయ్యింది.

Video Advertisement

నా ప్రశ్నకు మీరే సరైన సమాధానం చెప్పగలరని ఆశిస్తున్నాను.. ఈ పరిస్థితి నుంచి నేను ఎలా బయటపడాలో తెలియజేయగలరు..

నాకు పెళ్లయి ఎనిమిదేళ్లయింది. అయితే నేను పెళ్లి చేసుకున్నా వ్యక్తి చెడు వ్యసనాలకు మరియు డబ్బు పిచ్చి వలన అతనికి విడాకులు ఇచ్చేశాను. విడాకులు ఇచ్చిన కొంతకాలానికి నేను ఒక ఉద్యోగంలో చేరాను. ఆ ప్రొఫైల్ లో నా మ్యారేజ్ స్టేటస్ సింగిల్ గా పెట్టాను.

అయితే నాతో ఉద్యోగం చేస్తున్నా సహా ఉద్యోగులందరూ నాకు ఇంకా పెళ్లి కాలేదు అని భావిస్తున్నారు. రెండు సంవత్సరాల తర్వాత నా సహోద్యోగి నా వద్దకు వచ్చి పెళ్లి ప్రస్తావన తెచ్చారు. ఆయన వేరే మతానికి చెందిన వారు. ఇద్దరం ఒకరంటే ఒకరికి ఇష్టం.

office friends 1

ఆయన ఎప్పుడైతే పెళ్లి ప్రస్తావన తెచ్చారో.. నా గత జీవితంలో జరిగిన సంఘటన గురించి ఆయనకు తెలియజేశాను. అదేవిధంగా ఆయన గురించి మా తల్లిదండ్రులు కూడా చెబితే మా పెళ్ళికి మొదట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ కొంత సమయం తర్వాత నా ఒత్తిడి వల్ల పెళ్లికి సరే అన్నారు.

అదేవిధంగా అతని ఇంట్లో కూడా వాళ్ళ నాన్నగారు ఒప్పుకున్నారు కానీ, వాళ్ళ అమ్మ ఇంకా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆవిడ పరువు ప్రతిష్ట అనే విషయాన్ని గురించి చాలా పట్టింపు గల మనిషి. తను వాళ్ళ ఇంట్లో  పెద్ద కొడుకు. ఒకవేళ నన్ను గనుక పెళ్లి చేసుకుంటే మొదటి పెళ్లి అయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు  పరువు పోతుంది అనే భావన ఎక్కువగా ఉంది.

ఇదంతా  తెలిసిన మా అమ్మగారు కూడా నువ్వు అతని జీవితం నుంచి తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే అతనికి ఇది మొదటి పెళ్లి, నువ్వు వాళ్ళ ఇంట్లో అడుగు పెడితే, వాళ్ల మధ్య ప్రశాంతతను దూరం చేసిన దాన్ని అవుతావు అని అంటుంది.

అతను మాత్రం నువ్వు వెయిట్ చేస్తే ఇంట్లో వాళ్ళను ఒప్పించి ఏమంటున్నాడు. ఒకపక్కన తనంటే నాకు ఎంతో ఇష్టం. మరోపక్క నా వలన వాళ్ళ ఇంట్లో గొడవలు ఎందుకు అని అనిపిస్తుంది. అతని వదులుకోవాలా లేక పెళ్లి చేసుకోవాలా అర్థంకాక అయోమయ స్థితిలో ఉన్నాను. మీరే దీనికి సరైన సమాధానం ఇవ్వగలరని ఆశిస్తున్నాను..

Note: Images used in this article are for reference purposes only


End of Article

You may also like