హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం ‘బిగ్‌బాస్’ హోస్ట్ గా చేస్తున్నారు. ఇటీవలే కొత్త సినిమాను ప్రకటించారు. తాజాగా నాగార్జున చెల్లెలు, నిర్మాత నాగసుశీల పైమీద పోలీస్ కేసు రిజిస్టర్ అయ్యింది. ఆ వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Video Advertisement

నిర్మాత నాగసుశీల కుమారుడు హీరో సుశాంత్. గతంలో అనేక చిత్రాలలో హీరోగా నటించాడు. అయితే కొద్దిరోజుల నుండి తెలుగు సినిమాలలో కీలకపాత్రలలో నటిస్తున్నాడు. అయితే సుశాంత్ తల్లిపై కేసు ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం..
అక్కినేని నాగార్జున సోదరి నాగసుశీల తన కుమారుడు సుశాంత్ హీరోగా పలు చిత్రాలను నిర్మించారు. కరెంట్, అడ్డా, కాళిదాసు, ఆటాడుకుందాం రా వంటి సినిమాలను నిర్మించారు. అయితే ఈ చిత్రాలకు నాగసుశీలతో పాటు చింతలపూడి శ్రీనివాసరావు కూడా నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రాలు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. దాంతో నాగసుశీల, శ్రీనివాసరావుకు 2017లో విబేధాలు వచ్చాయి. వీరిద్దరు పార్టనర్స్ గా ఉండి, కొన్న ల్యాండ్ విషయంలో ఇద్దరికీ గొడవలు జరిగాయి. నాగసుశీల నాంపల్లి 2017లో చింతలపూడి శ్రీనివాసరావు మీద కోర్టులో కంప్లైంట్ చేశారు.
కోర్టు ఆదేశాలతో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. శ్రీనివాసరావు నాగసుశీల తన మీద తప్పుడు కేసులు పెట్టారని మీడియాకు చెప్పారు. నాగసుశీల శ్రీనివాసరావు పై సరి అయిన ఆధారాలు చూపించకపోవడంతో నాంపల్లి కోర్టు ఈ కేసును కొట్టివేసింది. అయితే ఇప్పుడు నిర్మాత నాగసుశీల పై అదే శ్రీనివాసరావు కేసు పెట్టాడు. నాగసుశీలతో పాటు మరో పన్నెండు మంది తన పై అటాక్ చేశారని శ్రీనివాసరావు తన కంప్లైంట్ లో పేర్కొన్నాడు. శ్రీనివాసరావు, నాగసుశీలతో కలిసి కొనుగోలు చేసిన భూములను అప్పుడే పంచుకున్నామని, తన వాటా భూమిని ఒక ఆశ్రమానికి డొనేట్ చేశానని, ఆ స్థలంలో ప్రస్తుతం ఆశ్రమం నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. కానీ  నాగసుశీల ఆ భూమి తనదేనని ఇప్పుడు గొడవ చేస్తున్నారని శ్రీనివాసరావు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. నాగసుశీల, ఆమె కుమారుడు సుశాంత్, బౌన్సర్లు, కొంత మంది వచ్చి దౌర్జన్యం చేశారని, గొడవ చేశారని శ్రీనివాసరావు ఆరోపణలు చేస్తున్నారు.

Also Read: హీరో విజయ్ ఆంటోని కూతురు ఆ-త్మ-హ-త్య ఎందుకు చేసుకుంది..? కారణం ఇదేనా..?