Ads
సాధారణంగా నడి రోడ్డుపై కార్ పంక్చర్ అవ్వడం అనేది ఇబ్బంది పెట్టె సమస్య. ముఖ్యంగా మెయిన్ రోడ్స్ దగ్గర మెకానిక్ షాప్స్ ఉండకపోవచ్చు. ఆ టైం లో ఎవరో ఒకరు వచ్చి సాయం చేసేవరకు మనం రోడ్డుపై పడిగాపులు కాయాల్సి వస్తుంది. టైర్ ని మార్చుకోవడం వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు.
Video Advertisement
కానీ, టైర్, స్టేఫినీ వంటివి లేకపోతే మాత్రం ఇబ్బంది తప్పదు. ఇక ఇలాంటి సమస్య ఏ అర్ధరాత్రో ఎదురైతే.. సాయం చేయడానికి ఒక్కరు కూడా కనిపించరు. అలాంటి పరిస్థితి కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ తల్లి కూతుళ్ళకి కూడా ఎదురైంది.
కార్ డోర్ తీసి బయటకి వచ్చి ఎవరినైనా సాయం అడగాలన్నా భయపడే పరిస్థితి నెలకొన్న రోజులివి. సాయం చేయడానికి ముందుకొచ్చే వారిలో ఏ మృగం ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అందుకే.. వారికి బయటకి వచ్చి ఎవరినైనా సాయం అడగాలన్నా భయం వేసింది. ఏమి చేయాలో తెలియని ఆ పరిస్థితిలో ఆ కూతురుకి వెంటనే ఓ ఆలోచన వచ్చింది.
అనుకున్నదే తడవుగా దిశా యాప్ కి ఎస్.ఓ.ఎస్. కాల్ చేసింది. కాల్ చేసిన పది నిమిషాల వ్యవధిలోనే నెల్లూరు జిల్లా మర్రిపాడు పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి నెల్లూరు వైపు ప్రయాణిస్తున్న టైం లో కార్ ట్రబులిచ్చింది. ఈ పరిస్థితిలో నెల్లూరు పోలీసులు సరైన సమయంలో స్పందించి వారికి సాయం అందించారు.
పదినిమిషాల్లో వారి వద్దకు చేరుకొని.. వారి కార్ టైర్ మార్పించి.. వారు గమ్యస్థానానికి వెళ్ళడానికి దోహదం చేసారు. వారు చేసిన సేవలు ఎప్పటికీ మరిచిపోలేమని, సరైన సమయంలో సాయం అందించారని.. దిశ యాప్ సర్వీస్ ను పటిష్టంగా అమలు పరిచినందుకు ఆ తల్లీకూతుళ్లు మర్రిపాడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
End of Article