ఆయనని బిచ్చగాడు అనుకోని సహాయం చేయాలనుకున్నారు…కానీ ఆయన ఎవరో తెలుసుకొని.?

ఆయనని బిచ్చగాడు అనుకోని సహాయం చేయాలనుకున్నారు…కానీ ఆయన ఎవరో తెలుసుకొని.?

by Mohana Priya

Ads

నవంబర్ 10వ తేదీన గ్వాలియర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. భద్రత వ్యవస్థను పర్యవేక్షించే బాధ్యతను డిఎస్పిలు అయిన రత్నేష్ సింగ్ తోమర్, విజయ్ బదౌరియాలకు అప్పగించారు. అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో విజయీ జులూస్ మార్గంలో డ్యూటీ చేస్తున్న వాళ్ళిద్దరికీ చలిలో వణుకుతూ ఒక బిచ్చగాడు కనిపించాడు. వారిద్దరూ ఆ బిచ్చగాడి పరిస్థితి చూసి జాలిపడి ఒకరు బూట్లను, ఇంకొకరు జాకెట్ ని ఇచ్చారు.

Video Advertisement

వాళ్ళిద్దరు వెళ్ళిపోతుండగా ఆ బిచ్చగాడు ఆ అధికారులని పేరు పెట్టి పిలిచాడు. వాళ్ల పేర్లు ఆయనకి ఎలా తెలుసు అని అనుకున్న అధికారులు ఆశ్చర్యంతో వెనక్కి వెళ్లి చూస్తే అప్పుడు వాళ్ళకి ఆయన ఎవరో తెలిసింది. ఆయన వాళ్ళ బ్యాచ్ కి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ మనీష్ మిశ్రా. మనీశ్ మిశ్రా 1999 లో మధ్య ప్రదేశ్ పోలీస్ విభాగంలో అధికారిగా ఉన్నారు. ఆయన చాలా మంచి షూటర్.

రత్నేష్ సింగ్ తోమర్, విజయ్ బదౌరియాలతో పాటు 1999 లో మనీష్ మిశ్రా కూడా సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో చేరారు. 2005 సమయంలో మనీశ్ మిశ్రా దతియా జిల్లాలో పోలీసు శాఖలో పని చేశారు. ఆ తర్వాత ఆయన మానసిక పరిస్థితి క్షీణించింది. మొదట్లో ఐదు సంవత్సరాలు ఆయన ఇంట్లోనే ఉన్నారు. ట్రీట్మెంట్ కోసం ఆశ్రమాల్లో, చికిత్స కేంద్రాల్లో చేర్చిన కూడా అక్కడి నుండి పారిపోతూ ఉండేవారు.

మనీశ్ మిశ్రా ఎక్కడికి వెళ్లారో కుటుంబ సభ్యులకు కూడా తెలిసేది కాదు. తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఆయన మానాన ఆయనని వదిలేశారు. భార్యతో విడాకులు అయ్యాయి. మనిషి మనీష్ మిశ్రా ని అలా రోడ్డు మీద దీన స్థితిలో చూసిన ఆ ఇద్దరు అధికారులు, ఆయనని తమతో పాటు తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు కానీ, మనీష్ మిశ్రా అందుకు ఒప్పుకోలేదు.

తర్వాత ఒక స్వచ్ఛంద సేవా సంస్థ సహాయంతో మనీష్ మిశ్రా ని స్వర్గ్ సదన్ ఆశ్రమంలో చేర్చారు. ప్రస్తుతం మనీష్ మిశ్రా అక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నారు. మనీష్ మిశ్రా శివపురిలో ఉండేవారు. ఇప్పుడు ఆయన తల్లిదండ్రులు అక్కడే ఉంటున్నారు. తోబుట్టువులు చైనాలో ఉద్యోగం చేస్తున్నారు. ఆశ్రమ సంచాలకులు సూర్య వంశీ మాట్లాడుతూ “మనీష్ మిశ్రా సోదరి మాట్లాడారు అని, వీలైనంత త్వరగా తాను వస్తాను అని, మనీష్ మళ్లీ తిరిగి మామూలు మనిషి అవ్వడానికి తనకు చేతనైనంత సహాయం చేస్తానని చెప్పారు అని,

శివపురి లో ఉన్న మనీష్ కుటుంబాన్ని సంప్రదించడానికి ప్రయత్నించినా కూడా సాధ్యపడలేదు అని, మనీష్ స్నేహితులైన ఆ ఇద్దరు అధికారులు ఆయనని చూసి వెళుతూ ఉండడం మాత్రమే కాకుండా మనీష్ మళ్లీ తిరిగి సాధారణ జీవితం ప్రారంభించడానికి కావలసిన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు” అని తెలిపారు సూర్య వంశీ.


End of Article

You may also like