Ads
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్స్‌లో ఒకరు పూజా హెగ్డే. ఇటీవల మోస్ట్ ఎలిజిలిబుల్ బ్యాచిలర్ సినిమాతో మరో హిట్ కొట్టి, ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే, రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న సర్కస్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అలాగే మరి కొన్ని సినిమాలను కూడా పూజా హెగ్డే సైన్ చేసారు. అంతే కాకుండా తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న బీస్ట్ సినిమాలో కూడా నటించారు. పూజా హెగ్డే తెలుగులో మొదటిగా నటించిన సినిమా ఒక లైలా కోసం. ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటించారు. ఈ సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుంది.
Video Advertisement
ఆ తర్వాత ముకుంద సినిమాలో నటించారు. ఈ సినిమాతో వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత దువ్వాడ జగన్నాథంలో నటించిన పూజా హెగ్డే వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. దాదాపు ప్రతీ స్టార్ హీరో సినిమాలో పూజా హెగ్డే నటించారు.
పూజా నటించిన రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు కూడా రీసెంట్ గానే విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే.. పూజా నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నా పూజా జోరు మాత్రం అస్సలు తగ్గడం లేదు. పూజ తమిళ నాట నటించిన బీస్ట్ సినిమా కూడా ఆశించినంత ఫలితాన్ని రాబట్టలేదు. అల వైకుంఠ పురం సినిమా తరువాత పూజాకు సరైన హిట్ పడలేదు. కానీ, దర్శక నిర్మాతలు మాత్రం ఆమెకు భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చి ఆఫర్స్ ఇస్తున్నారు. ఇప్పటికే.. ఆచార్య, రాధేశ్యామ్, బీస్ట్ సినిమాలతో పూజ కెరీర్ కొంచం డౌన్ అయినట్లు కనిపిస్తుంది. కానీ, ఆమె ఫామ్ లో ఉన్నపుడే ఇతర సినిమాలకు కూడా సైన్ చేసారు.
ఎఫ్ 3 సినిమాలో పూజ స్పెషల్ సాంగ్ లో కనిపించనుందన్న టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. రణ్ వీర్ తో నటించిన “సర్కస్” మూవీ, సల్మాన్ ఖాన్ ” కభీ ఈద్ కభీ దీవాలి” సినిమాలు కూడా విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఫలితాలతో పూజ కెరీర్ తిరిగి ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంది. పూజ అదే జోరుని కొనసాగించే అవకాశం ఉందనేది సినీ విశ్లేషకుల మాట.
End of Article