Ads
పూజ హెగ్డే ఒకప్పుడు టాలీవుడ్ లోనూ బాలీవుడ్ లోనూ కొలీవుడ్ లోనూ బిజీ హీరోయిన్. అయితే ప్రస్తుతం అమ్మడి చేతిలో ఒక్క టాలీవుడ్ సినిమా కూడా లేకుండా ఖాళీ అయిపోయింది.
Video Advertisement
సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఫెట్ ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ పూజా హెగ్డే. ఒకప్పుడు సినిమాలు చేయడానికి తిరిక లేనంత బిజీగా ఉండేది.
ముందుగా పూజ హెగ్డే తమిళ్లో ముఖముడి అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ఆ సినిమా అక్కడ ఆడకపోవడంతో ఆఫర్లు రాలేదు. అయితే తర్వాత తెలుగులో వరస పెట్టి ఆఫర్లు రావడం ఇక్కడ స్టార్ హీరోయిన్ అవడం జరిగింది. తాజాగా నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో ఒక్కసారిగా ఆమె గ్రాఫ్ పడిపోయింది.
అయితే ఇలాంటి కష్ట సమయాల్లో పూజా హెగ్డే కి కొలీవుడ్ నుంచి ఒక ఆఫర్ వచ్చిందని వార్త బయటకు వచ్చింది. కొలీవుడ్ లో నిర్మాణ సంస్థ avm స్టూడియోస్. ఎందరో స్టార్ డైరెక్టర్ లతో ఎందరో స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన సంస్థ ఇది. అయితే ప్రస్తుతం సినిమాల్లోకి గ్యాప్ ఇచ్చిన ఈ సంస్థ మళ్ళీ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది.
డీమాంటి కాలనీ సినిమా దర్శకుడు అజయ్ జ్ఞానముత్తుతో ఒక సినిమాని నిర్మించనుంది. ఈ సినిమాని ప్రముఖ ఓటిటి కోసం నిర్మిస్తున్నట్లుగా తెలియజేసింది. అయితే ఇది లేడీ ఓరియంటల్ సబ్జెక్టుగా తెలుస్తుంది. ఇందులో ప్రధాన పాత్ర కోసం పూజ హెగ్డే అని ఎంపిక చేసుకున్నారట. ఈ రకంగా పూజ హెగ్డేకి మంచి ఆఫర్ తలుపు తట్టింది
End of Article