పూజా హెగ్డే తెలుగులో చేయబోతున్న నెక్స్ట్ సినిమా ఇదేనా..?

పూజా హెగ్డే తెలుగులో చేయబోతున్న నెక్స్ట్ సినిమా ఇదేనా..?

by Mohana Priya

Ads

ఒక సమయంలో వరుసగా సినిమాలు చేసి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ పూజా హెగ్డే. ఇటీవల కొంత కాలం నుండి పూజా హెగ్డే తెలుగులో పెద్దగా సినిమాలు చేయట్లేదు. గుంటూరు కారం సినిమాలో కూడా మొదట పూజా హెగ్డే నటించాల్సి ఉంది.

Video Advertisement

కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు కూడా అలాగే ఆగిపోయాయి అంటూ వార్తలు వచ్చాయి. పూజా హెగ్డే ఒకటి రెండు హిందీ సినిమాలు చేస్తున్నారు. తెలుగు సినిమాలు ఎక్కువగా చేయట్లేదు.

అంతేకాకుండా ఒక సంవత్సరం నుండి పూజా హెగ్డే నటించిన సినిమాలు అన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి. దాంతో అవకాశాలు తగ్గాయి. ఇప్పుడు పూజ హెగ్డే నెక్స్ట్ తెలుగులో ఎప్పుడు సినిమా చేస్తారు అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే పూజా హెగ్డే నెక్స్ట్ ఒక యంగ్ హీరో తో నటించబోతున్నట్లు సమాచారం. సాయిధరమ్ తేజ్ హీరోగా రాబోతున్న ఒక సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తారు అనే వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా నాని, శిబి చక్రవర్తి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కూడా పూజా హెగ్డే నటిస్తారు అనే వార్త ప్రచారంలో ఉంది.

మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు. అయితే నాని, శిబి చక్రవర్తి సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఆగిపోయింది అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవేళ నిజంగా ఇది ఆగిపోతే ఈ సినిమా లేనట్టే. అంతేకాకుండా రవితేజ నెక్స్ట్ సినిమాలో కూడా పూజా హెగ్డే నటించే అవకాశం ఉంది అని అంటున్నారు. ఏదేమైనా సరే, పూజా హెగ్డే నెక్స్ట్ తెలుగు సినిమా కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు.


End of Article

You may also like