ప్రభాస్ నటిస్తున్న 20 వ సినిమా కోసం బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ?

ప్రభాస్ నటిస్తున్న 20 వ సినిమా కోసం బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ?

by Anudeep

Ads

సాహో’ చిత్రం తరువాత ప్రభాస్ చేస్తున్న భారీ మూవీ ఇది . ప్రభాస్ నటిస్తున్న 20 వ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది.తాజాగా ఈ సినిమా కి సంభందించిన ఫస్ట్ లుక్ మరియు సినిమా టైటిల్ ఈనెల 10వ తేదిన 10గంటలకు విడుదల చేయనున్నామని చిత్ర బృందం(యువీ క్రియేషన్స్ ) ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది . రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం చేస్తున్నారు రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ భారీ చిత్రానికి సంబంధించి అప్‌డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే సగం పైగా సినిమా పూర్తి చేసుకొంది.ఇండియా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది.

Video Advertisement

ప్రభాస్‌ 20వ మూవీకి సంగీత దర్శకుడు గా అమిత్‌ త్రివేదిని ఎన్నుకోగా కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకున్నారు. . సైరా ,బజరంగీభాయ్ జాన్, సుల్తాన్, టైగర్ జిందా హై, ఏక్తా టైగర్,వంటి  చిత్రాలకు మ్యూజిక్ కంపోజ్ చేసిన జూలియస్ పఖియమ్ ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నారు అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.ఈ సినిమా  కూడా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. తెలుగు తమిళ్, హిందీ , మలయాళ భాషల్లో విడుదల కానుంది.


End of Article

You may also like