Ads
ప్రభాస్ ఫాన్స్ ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది ఈరోజు ప్రభాస్ ఫాన్స్ ని రెండు పండుగలు ఒకటి తమ అభిమాన నటుడి పుట్టిన రోజు.. రెండోది ఏంటంటే.. ఆయన బర్త్ డే సందర్భంగా ట్రెండ్ అయ్యే ఫస్ట్ లుక్ పోస్టర్స్. ప్రభాస్ బాహుబలి తరువాత వరుసగా సినిమాలు సైన్ చేసేస్తూ వచ్చారు. ఈ సినిమాల తాలూకు అప్ డేట్స్ నేడు ఆయన బర్త్ డే సందర్భంగా విడుదల అవుతాయి.
Video Advertisement
కొద్దీ సేపటి క్రితమే.. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా టీం నుంచి అప్ డేట్ వచ్చింది. నిజానికి.. ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవుతుందని ముందే తెలిపారు. కానీ.. వారు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ ఫేస్ ని రివీల్ చేయలేదు. అసలు ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందో కూడా తెలియకుండా ఆ పోస్టర్ ని రిలీజ్ చేసేసారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమాపై మొదటి నుంచి హైప్ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. దీనితో ప్రభాస్ బర్త్ డే రోజు కచ్చితంగా ప్రభాస్ లుక్ రివీల్ చేస్తారు అని ఫాన్స్ ఎదురు చూసారు.
End of Article