ప్రభాస్ పెట్టిన ఆ ఒక్క కండిషన్ తో… ఇరకాటంలో పడ్డ డైరెక్టర్ మారుతి.! ఆ కండిషన్ ఏంటంటే.?

ప్రభాస్ పెట్టిన ఆ ఒక్క కండిషన్ తో… ఇరకాటంలో పడ్డ డైరెక్టర్ మారుతి.! ఆ కండిషన్ ఏంటంటే.?

by Anudeep

Ads

ప్రతిభావంతుడైన రచయిత మరియు దర్శకుడు మారుతీ కొత్త నటీనటులతో అనేక విజయాలు సాధించాడు.అయితే గత కొద్ది కాలంగా మారుతి ప్రభాస్ తో కలిసి సినిమా తీయబోతున్నాడు అని నెట్లో న్యూస్ హల్చల్ చేస్తూ ఉంది. కానీ ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన లేకపోవడంతో అది నిజమా కాదా అన్న డైలమాలో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

Video Advertisement

ఇటు ప్రభాస్ కూడా వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడడానికి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం అన్వేషిస్తున్నట్టు సమాచారం. మారుతి అయితే అలాంటి స్క్రిప్స్ బాగా హ్యాండిల్ చేయగలడు అన్న ఉద్దేశంతో ప్రభాస్ మారుతితో మూవీ చేయాలి అనుకుంటున్నాడని ఇండస్ట్రీ టాక్.

కానీ పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ లాంటి అగ్ర హీరో మారుతి లాంటి చిన్న డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని ఎందరో సందేహం వ్యక్తం చేశారు. కానీ ఈ వార్తలు తప్పు అని ప్రూవ్ చేస్తూ మొన్న బుధవారం మారుతి ప్రభాస్ కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి మొదలు కాబోతోందని సమాచారం.

prabhas

ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త అవతారంతో కనిపించనున్నారని…తిరిగి బుజ్జిగాడు ,డార్లింగ్ రేంజ్ లో ఈ చిత్రంలో ప్రభాస్ లుక్స్ ఉంటాయని తెలుస్తుంది. మాళవిక మోహన్ ,రాశి ఖన్నా ,మెహరీన్ ముగ్గురు ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమాకి మెయిన్ హీరోయిన్ మలయాళం బ్యూటీ మాళవిక అని భావిస్తున్నారు. 50 కోట్ల బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాకు ప్రభాస్ పెట్టిన కండిషన్ ఏమిటో తెలుసా?

ఈ మూవీ స్క్రిప్ట్ నచ్చిన ప్రభాస్ ఇది తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది భావించాడు. అందుకోసం తన ఫ్యాన్ ఇండియన్ ఇమేజ్ ని కూడా పక్కనపెట్టి ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేయాలి అని నిశ్చయించుకున్నాడు. మూడు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

reason behind prabhas movies disappoing after bahubali

అయితే ప్రభాస్ కండిషన్ ప్రకారం ఈ చిత్రం మొదట కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తారు తరువాత మిగతా భాషల్లో విడుదల చేస్తారు. మరి ప్రభాస్ కు అంతగా నచ్చిన మూవీ ఎలా ఉంటుందో రిలీజ్ వరకు వేచి చూడాలి. అది కాక ఈ సినిమా షూటింగ్ కోసం ప్రభాస్ కేవలం 50 రోజులు మాత్రమే కాల్ షీట్స్ ఇచ్చారంట. బాహుబలి తర్వాత హిట్ లేని ప్రభాస్ కు ఈ చిత్రం ద్వారా మారుతీ భారీ హిట్ అందించగలిగితే ఇక ఇండస్ట్రీలో అగ్ర డైరెక్టర్ల సరసన మారుతీ పేరు చేరుతుంది అనడంలో సందేహం లేదు.


End of Article

You may also like