Ads
టాలీవుడ్ యంగ్ హీరో ప్రభాస్ తక్కువ కాలం లోనే మంచి సినిమాలు చేసి గుర్తింపు సంపాదించు కున్నారు. ఈయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఆ తర్వాత ఈయన నటించిన సినిమాలు అన్ని పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ అవుతున్నాయి. బాహుబలి తరువాత సాహో, రాధేశ్యామ్ చిత్రాల్లో నటించారు ప్రభాస్. తర్వాత ప్రాజెక్ట్ కె, సలార్ సినిమాలు లైన్ లో ఉన్నాయి.
Video Advertisement
ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ప్రభాస్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కి గురువు, మార్గదర్శి అయిన తన పెదనాన్న కృష్ణం రాజుగారు కొద్ది రోజుల క్రితం అనారోగ్యం తో కన్ను మూసిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో వారి ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. కృష్ణం రాజు గారి మరణం మొత్తం ఇండస్ట్రీకి తీరని లోటుగా మారింది. ఇలా కృష్ణంరాజు గారు మరణించడంతో ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
కృష్ణంరాజు మరణించకపోయి ఉంటే ఇప్పటికే ఈయన నటిస్తున్నటువంటి ప్రాజెక్ట్ కే, సలార్ సినిమాలు కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం అయ్యేవి. అయితే కృష్ణంరాజు గారి మరణంతో ఈ సినిమాల షూటింగ్ ఆగిపోయింది.
కృష్ణం రాజు గారికి చివరి కార్యక్రమాలు పూర్తైన తర్వాత ప్రభాస్ షూటింగ్ లు చేస్తాడని అందరు భావించారు. కానీ ప్రభాస్ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ నెలలో ప్రారంభం కావాల్సిన కొత్త షెడ్యూల్ చిత్రీకరణను ఈ నెల మొత్తం వాయిదా వేస్తున్నట్లు సమాచారం.
ఈ నెలరోజుల పాటు ప్రభాస్ తన పెద్దమ్మకు, చెల్లెళ్లకు తోడుగా ఉండాలని భావించారట. అందుకే ఈ సమయంలో తాను షూటింగ్ లో పాల్గొనడం సరైనది కాదని భావించిన ప్రభాస్ ఈనెల మొత్తం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ నెలలో ప్రారంభం కావాల్సిన ప్రాజెక్టుకే, సలార్ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయని సమాచారం.
End of Article