ఓం రౌత్ ను ఆటాడుకుంటున్న తెలుగు అభిమానులు…ఎందుకో తెలుసా…?

ఓం రౌత్ ను ఆటాడుకుంటున్న తెలుగు అభిమానులు…ఎందుకో తెలుసా…?

by Mounika Singaluri

ప్రభాస్ తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఆది పురుష్ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది రామాయణం ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. అయితే ఈ సినిమాలో ఉన్న విఎఫ్ఎక్స్ భారీగా ట్రోల్స్ కి గురైంది. ఒక స్టార్ హీరోను పెట్టుకుని ఇటువంటి చీప్ క్వాలిటీ VFX చేస్తారా పిల్లల సినిమాల ఉంది అంటూ నెటిజన్లు ఒక రేంజ్ లో ఆటాడుకున్నారు.

Video Advertisement

adipurush movie review

అయితే ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులు ఓం రౌత్ ను టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు. అసలు ఏంటా విషయం అంటే ఈరోజు హనుమాన్ ట్రైలర్ విడుదలైంది. తేజ సబ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఈ మూవీ వస్తుంది. సూపర్ హీరో కాన్సెప్ట్ తో తర్కెక్కుతున్న ఈ మూవీ కూడా చాలా మటుకు విఎఫ్ఎక్స్ తో నిండి ఉంది. హనుమాన్ బడ్జెట్ ఆది పురుష్ బడ్జెట్ తో పోలిస్తే చాలా తక్కువ. కానీ విఎఫ్ఎక్స్ క్వాలిటీ విషయంలో హనుమాన్ చాలా అద్భుతంగా ఉంది. ఒక చిన్న డైరెక్టర్ కి ఉన్న కామన్ సెన్స్ కూడా పెద్ద డైరెక్టర్ కి లేదు…సినిమా అంటే ఇది చూసి నేర్చుకో అంటూ ఓం రౌత్ ను ఆటాడేసుకుంటున్నారు.


You may also like

Leave a Comment