బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె లో ప్రభాస్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె లో ప్రభాస్ ఎప్పుడు వస్తాడని ఫ్యాన్స్ ఎదురు చూసారు. ఆఖరికి ఈ ఎపిసోడ్ ని విడుదల చేశారు.

Video Advertisement

ఈ ప్రోగ్రాంలో ప్రభాస్ సినిమాల గురించి ప్రశ్నలు వేశారు. ప్రభాస్ చిత్రాలలో డైలాగ్స్ వేసి ఎందులో డైలాగ్ అని ప్రశ్నించారు బాలయ్య.

ఆ జవాబులన్నీ కూడా కరెక్ట్ గానే ప్రభాస్ చెప్పేసారు. ఇలా సరదాగా ప్రభాస్ మాట్లాడడం జరిగింది. ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా ఈ షో కి రాబోతున్నారు. మరి వీరి ముచ్చట్లు చూడాలంటె ఇంకొన్ని రోజులు ఆగాల్సి వుంది. ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వస్తున్నదని.. ఓ రేంజ్ లో ఉంటుందని అంతా అనుకున్నారు కానీ అంతలా ఆకట్టుకోలేదు. ఓ సినిమాకి చేసినంతగా ప్రచారం చేసారం ఈ షో కోసం. కానీ నిరాశే పరిచింది. పైగా ప్రభాస్ ఎప్పుడూ చెప్పని విషయాలు అన్నిటిని కూడా ఆహా లో చెప్పాడని కూడా అన్నారు కానీ అది వట్టి బిల్డప్ ఏ అని తెలుస్తోంది. పైగా ఎక్కువ హైప్ ఇచ్చారు. స్ట్రీమింగ్ మొదలు పెట్టిన గంటకి సర్వర్ డౌన్ అయిపోయింది. ఈ షో ని పైరసీ చేయకూడదని కోర్టుకు కూడా ఆహా వాళ్ళు వెళ్లారు.

prabhas fans disappointed about unstoppable glimps..

అయితే ఈ షో మొదలైన 50 నిమిషాల రన్ టైంలో కేవలం ఫ్యాన్స్ అరుపులు వట్టి కబుర్లే ఉన్నాయి. అలానే బాలయ్య ప్రభాస్ ఎలివేషన్లు కూడా వున్నాయి. అంతేకానీ అంత ఇంట్రెస్టింగ్ గా ఏమీ సాగలేదు. అయితే ప్రభాస్ ని అందరూ ఎక్కువగా అడిగే ప్రశ్న పెళ్లి ఎప్పుడు అని..? టీజర్ లో చూస్తే ప్రభాస్ పెళ్లి గురించి ప్రకటన చేశాడు అని నమ్మేటట్టుగా ఉంది కానీ ఎపిసోడ్ లో చూస్తే క్లారిటీ ఇచ్చేసిన విషయాన్ని బాలయ్య పట్టుకుని సాగదీశారు తప్ప మరి ఏమీ లేదు.

the heroine who is the reason for prabhas - gopichand clashes..

అలానే కృతి సనన్ ప్రభాస్ తో డేటింగ్ అని వచ్చిన రూమర్లు గురించి చెప్పారు. ఏది ఏమైనా బాహుబలి మొదటి ఎపిసోడ్ అని ప్రభాస్ బాలయ్య చాట్ షోలో ఆర్భాటం ఎక్కువ చేశారు చూస్తే అక్కడ ఏమీ లేదు. అయితే చరణ్ కి ఫోన్ చేసినప్పుడు కాస్త షో ఇంట్రెస్టింగ్ గా ఉంది. పైగా ప్రభాస్ రామ్ చరణ్ ఇంత క్లోజ్ అన్న విషయం కూడా బయటపడింది. గోపీచంద్ కూడా షోలో తర్వాత జాయిన్ అయ్యాడు. మరి గోపీచంద్ ప్రభాస్ కలిసి రెండవ ఎపిసోడ్ లో ఏమైనా ఆకట్టుకుంటారో లేదో చూడాలి.