Ads
ఉప్పలపాటి వెంకట సూర్య నారాయణ ప్రభాస్ రాజు… అచ్చమైన తెలుగు పేరు. మూడేళ్ళ కింది వరకు కేవలం తెలుగు వాళ్లకు మాత్రమే సొంతమైన ఈ పేరు బాహుబలి ప్రభంజనం తర్వాత ప్రపంచ సినిమా తెర మీద వెలిగిపోతుంది. ప్రభాస్ ఇప్పుడు ఇండియన్ స్టార్. అతడి సినిమాలన్నీ ఇప్పుడు పాన్ ఇండియన్ మార్కెట్ కలవి. కథ, నటీనటులు, సాంకేతిక వర్గం అన్ని పాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్నవే అన్నీ. బాహుబలి తర్వాత అతడి ఇమేజ్ అది. వరుసగా ప్రభాస్ చేస్తున్న సిసినిమాలన్ని పాన్ ఇండియన్ వే .
Video Advertisement
prabhas-nag-aswin-movie-title
సాలార్, ఆదిపురుష్ తర్వాత ‘మహానటి ‘ దర్శకుడు నాగ్ అశ్విన్ తో వైజయంతి బ్యానర్ మీద ప్రభాస్ సినిమా తీస్తున్న విషయం మనకు తెలిసిందే. గురు పౌర్ణమి సందర్బంగా జులై 25 న ప్రాజెక్ట్ K అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన యాక్షన్ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీ లో వేసిన సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది.
అయితే ఈ సినిమా కు బాహుబలి ని మించిన టైటిల్ ని ఆల్రెడీ ఫిక్స్ చేసినట్టు ఫిలిం నగర్ లో బజ్ క్రియేట్ అయితుంది. మహానటి తో వండర్ క్రియేట్ చేసిన నాగ్ అశ్విన్ “మహా ” సెంటిమెంట్ ను ఫాలో అవుతూ ప్రభాస్ సినిమా కు “మహా వీర ” అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. నిజంగానే ఇది బాహుబలి ని మించిన పవర్ ఫుల్ టైటిల్. ప్రభాస్ ఫాన్స్ కూడా బాహుబలి ని మించిన మహా వీర ను తెర మీద చూడాలనుకుంటున్నారు. అయితే టైటిల్ విషయం లో అఫీషియల్ అనౌన్సమెంట్ ఇంకా రావాల్సి ఉంది. ఏదేమైనా ఈ మహా వీర టైటిల్ మాత్రం ప్రభాస్ కి సూపర్ సెట్ అయ్యే టైటిల్ అని సినీ ప్రేమికులు అనుకుంటున్నారు. మహా నటి లాగే మహా వీర కూడా అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని కోరుకుంటున్నారు.
End of Article