ఆ “స్టార్ డైరెక్టర్” సినిమాకి నో చెప్పి… “ప్రభాస్” పొరపాటు చేశారా..?

ఆ “స్టార్ డైరెక్టర్” సినిమాకి నో చెప్పి… “ప్రభాస్” పొరపాటు చేశారా..?

by Sunku Sravan

Ads

ఖైదీ చేసిన తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీ లోనే వాంటెడ్ దర్శకుడిగా మారారు లోకేష్ కనకరాజ్. హీరో కార్తీ నటించిన ఈ మూవీ కోలీవుడ్ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయం సాధించింది.

Video Advertisement

ఈ మూవీ విజయవంతమవడంతో విజయ్ లాంటి స్టార్ హీరోతో డైరెక్ట్ చేసే ఆఫర్ కొట్టేశారు లోకేష్ కనకరాజ్. వీరి కాంబినేషన్ లో వచ్చినటువంటి మూవీ “మాస్టర్” మరో కమర్షియల్ హిట్ అందుకుంది.

దీంతోపాటుగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన “విక్రమ్” సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇందులో విజయ్ సేతుపతి, కమలహాసన్, ఫహాద్ ఫాజిల్ వంటి స్టార్లు నటించారు. అలాగే సూర్య కేమియో పాత్రలో కనిపించబోతున్నారు. ఇంతమంది స్టార్లు ఉండడంతో ఈ మూవీపై ఓ రేంజ్ లో బజ్ క్రియేట్ అయింది. ఈ మూవీని తమిళంతో పాటుగా ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ చేపడుతున్నారు.

అయితే దీనికోసం గత కొద్ది రోజులుగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అయితే లోకేష్ కనకరాజ్ తన తదుపరి సినిమాను టాలీవుడ్ హీరోతో చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీని కోసమే కొందరు స్టార్ హీరోలను కలిసి కథలను కూడా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన రామ్ చరణ్ ని కూడా కలిసినట్టు సమాచారం.. అయితే తాజాగా లోకేష్ ప్రభాస్ ను కూడా కలిసినట్టు తెలుస్తోంది.

కలవడమే కాదు ఆయన కథ కూడా చెప్పారట. కానీ ప్రభాస్ మాత్రం ఈ ప్రాజెక్టు చేయడానికి ఒప్పుకోలేదని టాక్. లోకేష్ కనకరాజ్ చెప్పిన కథ సీరియస్ యాక్షన్ అని ప్రభాస్ నో చెప్పినట్టు తెలుస్తోంది. అంతటి స్టార్ డైరెక్టర్ సినిమాను నో చెప్పి ప్రభాస్ తప్పు చేశాను అని ఫీల్ అయ్యేట్లు ఆయన ఎవరితో సినిమా తీసి సక్సెస్ అవుతారో చూడాలి. ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జగపతి బాబు కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.


End of Article

You may also like