సలార్ సినిమాలో చూపించిన “కాటేరమ్మ” గురించి ఈ విషయాలు తెలుసా..? నిజమైన కథ ఏంటంటే..?

సలార్ సినిమాలో చూపించిన “కాటేరమ్మ” గురించి ఈ విషయాలు తెలుసా..? నిజమైన కథ ఏంటంటే..?

by kavitha

Ads

రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా సలార్.  రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

Video Advertisement

‘హోంబలే ఫిలింస్’ బ్యానర్ పై నిర్మించిన ఈ  సినిమా భారీ అంచనాల మధ్య  రిలీజ్ అయ్యి,  దానికి మొదటి రోజు ఫస్ట్ షోతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ  మూవీలోని కాటేరమ్మ  కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటించిన సలార్ మూవీలో పృధ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ఆడియెన్స్ అలరిస్తున్నాయి. ‘‘కాటేరమ్మ రాలేదు కానీ, బదులుగా కొడుకుని పంపింది అమ్మ’’ అనే డైలాగ్‌ రాగానే ప్రభాస్‌ యాక్షన్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. థియేటర్లు బిజీఎం, విజిల్స్‌తో దద్దరిల్లుతున్నాయి. ఆ కాటేరమ్మ కథ గురించి చాలామందికి తెలియదు. కైలాసంలో శంకరుడు నిద్రిస్తున్న సమయంలో పార్వతి దేవి ప్రతి రోజూ రాత్రి సమయంలో వెళ్లి, సూర్యోదయం కాకముందే కైలాసానికి వెళుతుంది.
ఈ విషయం పై శంకరుడు పార్వతిదేవిని నిలదీస్తాడు. అయితే ఆమె తనకు తెలియకుండానే అలా జరిగిపోతుందని బాధపడుతుంది. ఓ రాత్రి కైలాసం అడవుల నుండి వెళ్తున్న పార్వతిని శంకరుడు అనుసరిస్తాడు. ఆమె ఒక్కసారిగా కాళికా రూపంలోకి మారి, పాతిపెట్టిన శవాలను తవ్వి, తీసి తినడానికి ప్రయత్నం చేస్తుంది. ఉగ్ర రూపంలోని పార్వతిదేవిని ఆపడానికి శివుడు అడవి దారిలో పెద్ద గొయ్యిని సృష్టిస్తాడు. పార్వతి ఆ గొయ్యిలో పడిపోయి, తను  చేసినదానికి పశ్చాత్తాపం పడుతుంది. ఇక మీదట ఇలాంటివాటికి దూరంగా ఉంటానని, ఉగ్రరూపాన్ని వదిలి పార్వతిదేవిగా శివుడికి వెంట వెళ్తుంది. అలా పార్వతి దేవి విడచిన శక్తి అవతారమే కాటేరమ్మగా చెబుతారు.
ద్రవిడ సంస్కృతి నుండి అవతరించిన శ్రీ కాటేరీ దేవత హిందూ దేవతగా మారింది. దుష్ట సంహారం చేస్తూ, తనను విశ్వాసించిన వాళ్లకు తోడుగా ఉండే దేవత కాటేరమ్మ. సౌత్ ఇండియాలో, ప్రధానంగా కర్ణాటకలో కాటేరమ్మగా,  తమిళనాడులో కాటేరీ అమ్మన్‌గా, అక్కడి ఆలయాల్లో కొలువై, నిత్యం పూజలు అందుకుంటోంది. కాటేరమ్మను పార్వతిమాత ఇంకో రూపంగా భావిస్తారు. కలియుగంలో జబ్బులను నయం చేయడానికి వెలిసిన దేవతగా పూజలు అందుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో గ్రామానికి కాపలా దేవతగా, కొన్ని ప్రాంతాల్లో కులదేవతగా ఎన్నో తరాల నుండి  కొలుస్తున్నారు.

Also Read: ‘అరవింద సమేత’ స్టోరీ ని మంచు విష్ణు సినిమా లో అప్పుడే చెప్పారుగా..!!

 


End of Article

You may also like