‘అరవింద సమేత’ స్టోరీ ని మంచు విష్ణు సినిమా లో అప్పుడే చెప్పారుగా..!!

‘అరవింద సమేత’ స్టోరీ ని మంచు విష్ణు సినిమా లో అప్పుడే చెప్పారుగా..!!

by Anudeep

Ads

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన క్రేజీ మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే హీరోయిన్. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో ఎన్టీఆర్ చిత్తూరు యాసలో చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులు అందర్నీ ఆకట్టుకున్నాయి.

Video Advertisement

స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసిన త్రివిక్రమ్.. ఎన్టీఆర్‌తో సినిమా తీసేందుకు చాలా ఏళ్లు సమయం తీసుకుని ఎన్టీఆర్ కోసం కసితో తన శైలికి భిన్నంగా ‘అరవింద సమేత’ కథను తయారు చేశారు త్రివిక్రమ్. తన సినిమాల్లో రక్తపాతం, హింసలకు దూరంగా ఉండే త్రివిక్రమ్ ‘అరవింద సమేత’లో రక్తపుటేరులు పారించారు. 2018 దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం నాలుగేళ్లు పూర్తి చేసుకుంది.

see what these NTR charecters teach us..!!
ఈ నేపథ్యం లో సామాజిక మాధ్యమాల్లో ఒక కామెడీ వీడియో వైరల్ అవుతోంది. హీరో మంచు విష్ణు నటించిన ‘దూసుకెళ్తా’ చిత్రం లోని ఒక సన్నివేశం లో అలీ కొందరికి ఒక కథ చెప్తూ..” అశాంతిగా ఉన్న ఊరిని హీరో ప్రశాంతం గా మారుస్తాడు అని చెప్తాడు.. అప్పుడు అక్కడున్న ఒకడు ఎలా మారుస్తాడు అని అడగ్గా.. అందర్నీ ఇష్టమొచ్చినట్టు కొట్టి.. ఇలా.. కొట్టి చివరికి శాంతి వచనాలు చెప్పాలి..” అని చెప్తాడు అలీ.

comedy bit which explains aravinda sametha.. movie..
దీంతో ఈ వీడియో పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా ని బ్రీఫ్ గా చెప్పేసినట్టున్నారే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు ఆ సినిమా చాలా విభిన్నం గా తెరకెక్కించారు త్రివిక్రమ్ అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు. కానీ ఇదే జోనర్ తో తెలుగు లో ఇప్పటికే చాలా సినిమాలు తెరకెక్కాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

comedy bit which explains aravinda sametha.. movie..
ఈ చిత్రం లో తన తండ్రిని చంపిన శత్రువులను చంపకుండా.. వారిని మార్చి తమ గ్రామాల్లో శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తాడు ఎన్టీఆర్. త్రివిక్రమ్ మేజిక్ మేకింగ్ తో పటు తమన్ మ్యూజిక్ ఈ చిత్రాన్ని సూపర్ హిట్ గా నిలిపాయి.

https://www.instagram.com/reel/Cjc9F5wp9dU/?igshid=YmMyMTA2M2Y%3D

 


End of Article

You may also like