రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారుసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ బాహుబలి చిత్రంతో ప్రస్తుతం ఇండియా టాప్ స్టార్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు.ప్రస్తుతం ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ‘రాధే శ్యామ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్రం టీమ్ తాజాగా విడుదల చేసింది.ఆ లుక్ పై మంచి రెస్పాన్స్ రావడంతో చిత్ర టీం అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ మరియు ‘గోపికృష్ణ మూవీస్’ బ్యానర్ ‌పై కృష్ణంరాజు గారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రంతో కృష్ణంరాజు గారు తన పెద్ద కుమార్తె ప్రసీదను ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లో అరంగేట్రం చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కేవలం ఈ సినిమాకి మాత్రమే కాకుండా ప్రసీద ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌ కోసం సినిమాలను, వెబ్ సిరీస్‌లను కూడా నిర్మించడానికి సిద్దమౌతుందట.ఈ విషయంలో ప్రసీద కు పూర్తి సహకారం అందించడానికి ప్రభాస్ సిద్ధం అవుతున్నట్లు సమాచారం.