స్పిరిట్ సినిమాలో 44 ఏళ్ల ప్రభాస్ పక్కన… 31 ఏళ్ల హీరోయిన్..! చెల్లెలి లాగా ఉంటుంది ఏమో..!

స్పిరిట్ సినిమాలో 44 ఏళ్ల ప్రభాస్ పక్కన… 31 ఏళ్ల హీరోయిన్..! చెల్లెలి లాగా ఉంటుంది ఏమో..!

by Mohana Priya

Ads

వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో ప్రభాస్. గత సంవత్సరం సలార్ సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చారు. ప్రస్తుతం కల్కి 2898 ఏడి సినిమా పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత సలార్ రెండవ భాగం షూటింగ్ చేస్తారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో నటిస్తారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటిస్తారు అని సమాచారం. సినిమా అనౌన్స్ చేసి దాదాపు రెండు సంవత్సరాలు అయ్యింది. కానీ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్లలేదు. ఎందుకంటే స్క్రిప్ట్ పని ఇంకా జరుగుతోంది. ప్రభాస్ పాత్రని చాలా బాగా డిజైన్ చేస్తున్నారు.

Video Advertisement

సందీప్ దర్శకత్వంలో ప్రభాస్ ఎలా ఉండబోతున్నారు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. సినిమాలో హీరోయిన్స్ పేర్లు కూడా కొంత మంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అందులో మెయిన్ హీరోయిన్ గా నటించబోయే హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది. కీర్తి సురేష్ ఈ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా నటిస్తారు అనే వార్త వచ్చింది. మరి అందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియదు. కీర్తి సురేష్ కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. సర్కారు వారి పాట వంటి కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే, నటనకి ఆస్కారం ఉన్న ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. రెండిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదుగుతున్నారు. ప్రస్తుతం హిందీలో కూడా సినిమాలు చేస్తున్నారు. దాంతో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.

ప్రభాస్ వయసు 44 సంవత్సరాలు, కీర్తి సురేష్ వయసు 31 సంవత్సరాలు. వయసు తేడా కూడా పెద్దగా ఏమీ లేదు. కాకపోతే ప్రభాస్ చాలా ఎత్తుగా ఉంటారు. కీర్తి సురేష్ ఎత్తు తక్కువగా ఉంటారు. ప్రభాస్ 6 అడుగుల 2 అంగుళాల పొడవు ఉంటారు. కీర్తి సురేష్ 5 అడుగుల 2 అంగుళాల పొడవు ఉంటారు. కాబట్టి ఇద్దరు పక్కపక్కన సూట్ అవ్వరు ఏమో అని ఆలోచనలు కూడా వస్తున్నాయి. దాంతో ఒకవేళ హీరోయిన్ గా నటిస్తే ప్రభాస్ పక్కన కీర్తి సురేష్ చెల్లిలాగా ఉంటారు అని అంటున్నారు. ఈ విషయం మీద ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి. ప్రస్తుతం అయితే సినిమా బృందం స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారు. ప్రభాస్ కూడా షూటింగ్ పనిలో ఉన్నారు.


End of Article

You may also like