వైఎస్ రాజశేఖర్ రెడ్డితో “ప్రభాస్” దిగిన ఫోటో చూసారా..?

వైఎస్ రాజశేఖర్ రెడ్డితో “ప్రభాస్” దిగిన ఫోటో చూసారా..?

by kavitha

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ రీసెంట్ గా ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 22న రిలీజ్ అయ్యి, అన్ని భాషలలో దూసుకెళ్తోంది. ఈ మూవీ 3 రోజులు పూర్తి చేసుకుని, 4వ రోజు విజయవంతంగా కొనసాగుతుంది.

Video Advertisement

తాజాగా హోం బలే ఫిలిం మేకర్స్ 3 రోజులకు 402 కోట్ల వసూళ్లను కలెక్ట్ చేసినట్లు, అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ పాత రేర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాలతో  తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుని, పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. ప్రభాస్ ‘ఈశ్వర్’ మూవీతో 2002లో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అయితే 2004లో వచ్చిన వర్షం సినిమాతో ప్రభాస్‌కు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
salaar movie review2005లో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి మూవీతో మాస్ ఆడియెన్స్ కి చేరువయ్యాడు. ఇక ఆ తర్వాత చేసిన చిత్రాలు దాదాపు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. బహుబలి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే, ప్రభాస్, వైస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న పాత మరియు రేర్ ఫోటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
2007 లో ప్రభాస్, నయనతార జంటగా నటించిన ‘యోగి’ మూవీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా వి.వి వినాయక్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని పొందలేకపోయింది. ఇక ఈ చిత్రాన్ని వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిళ నిర్మించారు. యోగి మూవీకి షర్మిళ బడ్జెట్ పెట్టి, నిర్మాతగా వ్యవహరించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో ప్రభాస్, నయనతార ఒకసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, విజయమ్మతో దిగిన ఫొటో దిగారు. ఆ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో  వైరల్ గా మారింది.

Also Read: సలార్ సినిమాలో చూపించిన “కాటేరమ్మ” గురించి ఈ విషయాలు తెలుసా..? నిజమైన కథ ఏంటంటే..?


You may also like

Leave a Comment