“నీకో కొత్త సూట్ కేసు కావాలనుకుంటా.?” అంటూ…పృథ్వీ షా పై సెటైర్ వేసిన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్.!

“నీకో కొత్త సూట్ కేసు కావాలనుకుంటా.?” అంటూ…పృథ్వీ షా పై సెటైర్ వేసిన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్.!

by Mohana Priya

Ads

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ ట్వంటీ-20 మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ పృథ్వీ షా తన బ్యాటింగ్ తో దూసుకెళ్లారు. గురువారం నాడు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కి, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కి మధ్య జరిగిన మ్యాచ్ లో పృథ్వీ షా 41 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్సర్లతో 82 పరుగుల స్కోర్ చేసి జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

Video Advertisement

ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఆడిన పృథ్వీ షా ఓవర్లో 6 ఫోర్లు కొట్టారు. ఐపీఎల్ చరిత్రలో భారత్ సీనియర్ బ్యాట్స్మెన్ అజింక్య రహానే తర్వాత ఒకే ఓవర్లో 6 ఫోర్లు కొట్టిన రెండవ క్రికెటర్ గా ఘనతను సాధించారు పృథ్వీ షా. కోల్కతా మ్యాచ్ లో పృథ్వీ షా ఐదు అవార్డులను గెలుచుకున్నారు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సఫారి సూపర్ స్ట్రైకర్ (200 స్టైక్‌ రేట్‌), గేమ్ ఛేంజర్ అవార్డ్ (117 ఫాంటసీ పాయింట్స్), క్రెడ్ పవర్ ప్లేయర్ అవార్డ్ (పవర్‌ ప్లేలో 48 నాటౌట్‌ 16 బంతుల్లో), అప్ స్టాక్స్ మోస్ట్ వాల్యుబుల్ అస్సెట్ అవార్డ్ (అప్‌స్టాక్స్‌ క్రిక్‌ఇన్‌డెక్స్‌ 38 పాయింట్లతో) లను పృథ్వీ షా గెలుచుకున్నారు. దీంతో నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా పృథ్వీ షా కి అభినందనలు తెలిపారు.

అలాగే పృథ్వీ షా గర్ల్ ఫ్రెండ్ అనే వార్తలు వినిపిస్తున్న నటి ప్రాచీ సింగ్ కూడా సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పృథ్వీ షా మాట్లాడుతున్న ఒక ఫోటో పెట్టి “నాకు చాలా గర్వంగా ఉంది” అని కామెంట్ పెట్టారు ప్రాచీ సింగ్. అలాగే పృథ్వీ షా అందుకున్న అవార్డులన్నిటిని కొల్లాజ్ చేసి “వీటన్నిటినీ ప్యాక్ చేయడానికి కొత్త సూట్ కేస్ కావాలి” అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ప్రాచీ సింగ్ పెట్టిన ఈ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


End of Article

You may also like