• చిత్రం : లవ్ టుడే
 • నటీనటులు : ప్రదీప్ రంగనాథన్, ఇవానా, సత్యరాజ్, రాధికా శరత్‌కుమార్.
 • నిర్మాత : కల్పతి ఎస్.అఘోరం, కల్పతి ఎస్.గణేష్, కల్పతి ఎస్.సురేష్ (AGS ఎంటర్‌టైన్‌మెంట్)
 • దర్శకత్వం : ప్రదీప్ రంగనాథన్
 • సంగీతం : యువన్ శంకర్ రాజా
 • విడుదల తేదీ : నవంబర్ 25, 2022

love today movie review

Video Advertisement

స్టోరీ :

ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్), నికిత (ఇవానా) ప్రేమించుకుంటారు. తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. దీనికోసం వారిద్దరూ కలిసి నికిత తండ్రి (సత్యరాజ్) దగ్గరికి వెళ్తారు. నికిత తండ్రి వారు ఇద్దరిని ఒక్కరోజు ఒకరి ఫోన్లు ఒకరు తీసుకోమని చెప్తారు. ఆ తర్వాత కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అనుకుంటే తనకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటారు. ప్రదీప్, నికిత ఇది విని ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం అంటే సాధారణ విషయం అనుకొని ఫోన్లు మార్చుకుంటారు. కానీ తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం మొదలుపెడతారు. ఆ తర్వాత ఏమయ్యింది? వారిద్దరూ కలిసారా? ఒకరి గురించి ఒకరికి తెలిసిన నిజాలు ఏంటి? వారి సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

love today movie review

రివ్యూ :

సాధారణంగా లవ్ స్టోరీ సినిమాలకి భాషా భేదం ఉండదు అంటారు. ఏ భాషలో అయినా సరే ఒక ప్రేమ కథ రూపొందితే అది మిగిలిన భాషల్లో డబ్ అయినా కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు అని అంటూ ఉంటారు. ఈ సినిమా తమిళ్ లో రూపొందింది. అక్కడ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటోంది. దాంతో ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేశారు. సినిమా స్టోరీ పాయింట్ వినడానికి సింపుల్ గా ఉన్నా కూడా తెరపై మాత్రం చాలా కష్టమైన సబ్జెక్ట్ లాగానే అనిపిస్తుంది.

love today movie review

అందుకే ఇలాంటి స్టోరీకి టేకింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రదీప్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సినిమా మొదటి నుండి చివరి వరకు ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా సినిమాకి కామెడీ చాలా పెద్ద హైలైట్ అయ్యింది. మోడ్రన్ రిలేషన్ షిప్స్ ఎలా ఉంటాయి అనేది ఈ సినిమా ద్వారా చూపించారు. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. కానీ వారిద్దరి లవ్ స్టోరీ, అలాగే హీరోయిన్ కి సంబంధించిన కొన్ని విషయాలు ఇంకా కొంచెం వివరంగా చూపిస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. కొన్ని సీన్స్ హడావిడిగా తీసేసినట్టు అనిపిస్తాయి.

love today movie review

ప్లస్ పాయింట్స్ :

 • స్టోరీ పాయింట్
 • కామెడీ
 • పాటలు
 • నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:

 • కట్ చేసినట్టుగా అనిపించే కొన్ని సీన్స్
 • ఫస్ట్ హాఫ్ లో ల్యాగ్

రేటింగ్ :

3.5/5

ట్యాగ్ లైన్ :

ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ వచ్చి చాలా రోజులు అయ్యింది. సినిమా ట్రైలర్ చూసి సినిమాలో కామెడీ చాలా ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళిన వారిని కూడా లవ్ టుడే సినిమా అస్సలు నిరాశపరచదు.

watch trailer :