రెండేళ్ల తర్వాత నువ్వు నన్ను కలవలేవు అన్నారు…శోభన్ బాబు గారు చెప్పినట్టే జరిగింది.!

రెండేళ్ల తర్వాత నువ్వు నన్ను కలవలేవు అన్నారు…శోభన్ బాబు గారు చెప్పినట్టే జరిగింది.!

by Megha Varna

Ads

తెలుగు ఇండస్ట్రీలో శోభన్ బాబు జీవన శైలే వేరు..తను అందరు నటులకంటే భిన్నం..కేవలం నటనతోనే కాదు, తన జీవన శైలితోనూ ప్రేక్షకులను సంపాదించుకున్న నటుడు శోభన్ బాబు..అందంతో అమ్మాయిల హృదయాలు దోచుకున్న శోభన్ బాబు, అందగాడిగా ఉన్నప్పుడే తెరమరుగయ్యారు..తర్వాతెప్పుడూ తెరపై కనిపించలేదు..ఇది ఆయన నిబద్దతకు నిదర్శనం..ఇండస్ట్రీలో ఎందరో నటులతో సత్సంబంధాలు కలిగి ఉన్న శోభన్ బాబు గురించి ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నారు ప్రకాశ్ రాజ్..

Video Advertisement

శోభన్ బాబుతో తనకున్న అనుబంధం గురించి, ఇండస్ట్రీలో తొలిరోజుల్లో శోభన్ బాబు తనతో చెప్పిన మాట గురించి చెప్పారు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్..ఆయన  మాటల్లోనే‘‘శోభ‌న్‌బాబు నేనూ.. ‘దొర‌బాబు’ చిత్రంలో న‌టించాం. కొత్తగా ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన‌వాణ్ని దాంతో ఉత్సాహంగా ఉండేవాన్ని, యాక్షన్ సన్నివేశాల్లో దూకుడుగా వ్యవహరించేవాన్ని,అది చూసిన శోభన్ బాబు.. నటనే కదా ఎందుకంత తొందర కాస్త నిదానం అని అన్నారు…

మరుసటి రోజు షూటింగ్ గ్యాప్ లో ఒకసారి  న‌న్ను ద‌గ్గ‌రికి పిలిచి “ప్ర‌కాష్ నువ్వు రెండేళ్ల త‌ర్వాత న‌న్ను మ‌ళ్లీ క‌లువు”అన్నారు. రెండేళ్ల త‌ర్వాత క‌ల‌వ‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌డ‌మేంటి గురువుగారూ, త‌ప్ప‌కుండా క‌లుస్తాను”అని చెప్పాను..దానికి ఆయన నవ్వుతూ..”నువ్వు కలవలేవు..ఎందుకంటే అప్పుడు నువ్వు బిజీ ఆర్టిస్ట్ వి అయ్యుంటావ్ అని చెప్పారు..ఆయ‌న చెప్పిన‌ట్టుగానే రెండేళ్ల  త‌ర్వాత వరుస అవకాశాలతో నేను చాలా బిజీ అయిపోయాను అని అన్నారు ప్రకాశ్ రాజ్.

సడన్ గా ఒక రోజు ఆయ‌న ఎదురుపడినప్పుడు “గురువుగారూ, మీరు చెప్పిందే నిజ‌మైంది, మిమ్మ‌ల్ని క‌ల‌వ‌లేక‌పోయాను. అంత బిజీగా ఉన్నా”అని చెప్పా. “నీలో విద్వ‌త్తుని చూసే ఆ రోజు ఆ మాట చెప్పా. నీకు మ‌రింత భ‌విష్య‌త్తు ఉంది. మ‌రింత ఎత్తుకు ఎదుగుతావు” అని చెప్పి ఆయ‌న వెళ్లిపోయారు. ఆయన ఆశీర్వాదం ఫలితంగానే ఇంతదూరం వచ్చా అని అనిపిస్తుంటుంది.. అని శోభన్ బాబుతో తన అనుబంధాన్ని తన, వాక్బలాన్ని గుర్తు చేసుకున్నారు ప్రకాశ్ రాజ్.

కేవలం నటన విషయంలోనే కాదు, జీవితం విషయంలో కూడా చాలా పక్కా ప్రణాలికతో ఉండేవారు శోభన్ బాబు.. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది శోభన్ బాబు పాలసీ..అదే విషయాన్ని తోటి నటులకు చెప్పేవారు..అవకాశాలు ఈ రోజుంటాయి , రేపుండకపోవచ్చు కాబట్టి డబ్బు సంపాదించుకోవడానికి మరొక మార్గం ఎంచుకోవాలంటూ సూచించేవారు.. శోభన్ బాబు చెప్పిన విధంగానే నటుడు మురళీమోహన్ రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగడం , విజయం సాధించడం ..అది శోభన్ బాబు మాట వలనే సాధ్యం అయింది అంటుంటారు మురళీ మోహన్..


End of Article

You may also like