ఏ పాత్రనైనా అలవోకగా నటించగల విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ .సామాజిక సమస్యలపై గళం విప్పే సినిమా వాళ్ల జాబితాలో ప్రకాశ్ రాజ్ ది మొదటి పేరుంటుంది. సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలు పోషించే ప్రకాశ్ రాజ్ రియల్ లైఫ్ హీరో అని ఎనో సార్లు ప్రూవ్ చేసుకున్నారు. తాజాగా కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా ఆయన చేసిన ఒక పని ఇప్పుడు నెటిజెన్ల ప్రశంసలు అందుకుంటుంది.

Video Advertisement

కరోనా సమయంలో రోజువారి ఉపాధి చేసుకొని డబ్బులు సంపాదించుకుని ఇల్లు గడిపించే వారికీ ఎంతో ఇబ్బంది అవుతుంది. ఈ క్రమంలో తన ఇంట్లో, ఫార్మ్ హౌస్ లో, ఫిల్మ్ ప్రొడక్షన్, ఫౌండేషన్ లో ఉద్యోగం చేసేవారికీ ముందుగానే మే నెల వరకు జీతాలు చెల్లించారంట ప్రకాష్ రాజ్. అలాగే తాను నిర్మిస్తున్న మూడు చిత్రాలకు సంబందించి షూటింగ్ ఆగిపోయిన నేపథ్యంలో దినసరి వేతన కార్మికులకు సగం మొత్తం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ప్రకాష్ రాజ్. నా శక్తి మేరకు నేను చేస్తాను. మీరు కూడా మీ చుట్టూ ఉండే వారిని ఆదుకోండి. ఒకరికి అండగా నిలవాల్సిన తరుణం ఇది అని ప్రకాశ్ రాజ్ ట్వీట్టర్‌లో తెలిపారు.