Ads
ఎప్పుడూ లేని విధంగా 2024 లో టాలీవుడ్ లో సినిమాలు మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ఈసారి ఏకంగా 5 తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఐదిట్లో అందరి దృష్టి మహేష్ బాబు గుంటూరు కారం పైనే ఉంది ఈ సినిమా జనవరి 12 విడుదలవుతుంది.
Video Advertisement
ఇది కాకుండా వెంకటేష్ 75వ సినిమాలో సైన్ధవ్ రవితేజ నటిస్తున్న ఈగల్ నాగర్జున నా సామిరంగా సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి అయితే ఈ పెద్ద సినిమాల పక్కన ఒక చిన్న సినిమా అందరూ దృష్టిని ఆకర్షిస్తుంది. అదే తేజ సజ్జ,ప్రశాంత వర్మల హనుమాన్. ఈ సినిమా కూడా జనవరి 12 తారీఖున విడుదలవుతుంది. గుంటూరు కారంకి పోట పోటీగా ఈ సినిమా వస్తుంది.
అయితే ప్రస్తుతం ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత వర్మ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. జనవరి 12న గుంటూరు కారం వస్తుండడం వల్ల ఆరోజు తప్పుకుని వేరే రోజు రావాలని తమని బెదిరిస్తున్నారని డైరెక్టర్ చెప్పాడు. ఇప్పటికే నిర్మాతల మండలి మీటింగ్ లో కూడా ఈ విషయాన్ని చెప్పగా హనుమాన్ మేకర్స్ అయితే వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. హనుమాన్ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది.హిందీలో జనవరి 12న డేట్ ఫిక్స్ చేయడంతో తప్పుకొలేమని చెప్పారు. దీనివల్ల తమపై కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని, ఆవేదన వ్యక్తం చేశారు.అయినా సరే తమ కంటెంట్ మీద తమ సినిమా మీద తమకు నమ్మకం ఉందని గుంటూరు కారం చూసిన తర్వాత అయినా మా సినిమాకి వస్తారని దీమా వ్యక్తం చేశారు
End of Article