శానిటైజర్ వాడుతున్నారా? అయితే ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి!

శానిటైజర్ వాడుతున్నారా? అయితే ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి!

by Anudeep

Ads

కరోనా వైరస్ పుణ్యమా అని ప్రతిఒక్కరికి వ్యక్తిగత శుభ్రత అలవడింది.. తరచూ చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం, ప్రతీది శుభ్రం చేసిన తర్వాతనే ఉపయోగించడం..ఇలా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.,ఈ క్రమంలో శానిటైజర్లకు ఎక్కడలేని వాడకం పెరిగిపోయింది.. మన ఆరోగ్యం పట్ల జాగ్రత్తతో శానిటైజర్ ఉపయోగం మంచిదే , కానీ శానిటైజర్ వాడేటప్పుడు కూడా పాటించాల్సిన జాగ్రత్తలున్నాయి..అవేంటో తెలుసా..?

Video Advertisement

 

#1. పదేపదే చేతులు కడుక్కోలేక చేతిలోకి కొంచెం శానిటైజర్ ని తీసుకుని , చేతులు రుద్దుకోవడం సింపుల్ గా అనిపిస్తుంది..పిల్లలకు కూడా ఇదే అలవాటు చేస్తున్నారు చాలామంది..కాని పదేళ్లలోపు పిల్లలు శానిటైజర్ వాడినప్పుడు నోట్లో వేలు పెట్టుకోనివ్వకుండా చూడాల్సిన బాద్యత పెద్దలదే..నోట్లో వేలు పెట్టుకునే అలవాటున్న పిల్లలకు శానిటైజర్ ఇవ్వకపోవడమే మంచిది. శానిటైజర్లలో ఎన్నో కెమికల్స్ ఉంటాయనే విషయం తెలిసిందే, బ్యాక్టిరియాలను నాశనం చేయాలని, రసాయనాల వలన కొత్త సమస్యలు తెచ్చుకోవద్దు.

#2. మన శరీరంలో,మన చేతులపై ఉండేదంతా చెడు వ్యాక్టీరియా కాదు. మనకి ఉపయోగపడే బ్యాక్టీరియా అంటే మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది.శానిటైజర్ వినియోగం వలన చెడు బ్యాక్టిరియాతో పాటు, మన చేతులపై ఉండే మంచి బ్యాక్టిరియా కూడా నిర్మూలించబడుతోంది.. అంతేకాదు పదే పదే శానిటైజర్ల వినియోగంతో బ్యాక్టిరియాని నాశనం చేయడం వలన మన శరీరంలో స్వయంగా బ్యాక్టీరియాను నాశనం చేసే శక్తి కోల్పోతుంది..దాని ద్వారా మన రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది..కాబట్టి ముందు మన శరీరంలోని రోగనిరోధక శక్తిని మెరుగుపర్చుకుంటే బ్యాక్టిరియాతో ఫైట్ చేసే శక్తిని మన శరీరమే స్వయంగా కలిగి ఉండేలా చేయవచ్చు.

#3. మరీ ముఖ్యమైన విషయం ఇంట్లోని ఆడవారు శానిటైజర్స్ వినియోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.శానిటైజర్లలో  60-90శాతం ఆల్కహల్ ఉంటుంది..ఈ ఆల్కహాల్ కు మండే స్వభావం ఉంటుంది..కాబట్టి ఇంట్లో వంట చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు దీపాలు పెట్టేదగ్గర జాగ్రత్తగా ఉండాలి.రసాయన పరిశ్రమలో పనిచేసేవారు విధులకు వెళ్లేముందు శానిటైజర్లను వాడకపోవడం ఉత్తమం.

 

#4. ఒక విషయం గుర్తుపెట్టుకోండి శానిటైజర్ వాడకం వలన కేవలం చేతులపై ఉన్న బ్యాక్టిరియా, వైరస్ మాత్రమే నాశనం అవుతాయి..దుమ్ము-దూళీ, జిడ్డులాంటివి అలాగే ఉంటాయి..కాబట్టి  ఇన్ని ప్రాబ్లంస్ కంటే చేతులను నీటితో, సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం ఉత్తమం..మినిమం 30సెకన్ల పాటు చేతులను కడుక్కోవడం మర్చిపోకండి..

 

 

 

 

 


End of Article

You may also like