ఇప్పుడు టాలీవుడ్ మొత్తం ఈ హీరోయిన్ వైపే చూస్తోంది..! ఈమె ఎవరంటే..?

ఇప్పుడు టాలీవుడ్ మొత్తం ఈ హీరోయిన్ వైపే చూస్తోంది..! ఈమె ఎవరంటే..?

by Harika

Ads

మన తెలుగు ప్రేక్షకులకు ఏ సినిమా అయినా భాషా బేధం లేకుండా ఆదరిస్తారు. ఒక సినిమాలో ఎవరైనా నటీనటులు నచ్చితే వాళ్లకి గుడి కట్టేస్తారు. ఒక హీరోయిన్ స్టార్ అవ్వాలంటే అలాంటి ఒక్క చిత్రం చాలు. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్స్ అయిన చాలామంది హీరోయిన్లను ఇప్పటికే మనం చూసాము. లవర్స్ డే సినిమాలో కన్ను కొడుతూ ప్రియా ప్రకాష్ వారియర్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. పుష్ప సినిమాలో నటించిన రష్మిక భారతదేశమంతటా ఎక్కడ లేని ప్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది.

Video Advertisement

premalu movie review

అలాగే సప్త సాగరాలు దాటి సినిమాలో రుక్మిణి, యానిమల్ సినిమాలో త్రిప్తి దిమ్రి కూడా ఓవర్ నైట్ స్టార్స్ అయినవాళ్లే. ఒక సినిమాతో ఎక్కడలేని పాపులారిటీ తెచ్చుకున్నారు ఈ భామలు. అయితే ఈ లిస్టులో మరొక మలయాళీ బ్యూటీ కూడా ఆడ్ అయింది. మలయాళీ హీరోయిన్లు ఎప్పుడూ అందరినీ ఆకట్టుకునేలాగే కనిపిస్తారు వాళ్ళ సినిమాలు తెలుగు వాళ్లకు భలే నచ్చుతాయి. తాజాగా మలయాళం లో విడుదలైన ప్రేమలు చిత్రం మంచి రెస్పాన్స్ ని అందుకుంది. అయితే రాజమౌళి కొడుకు అయిన ఎస్ ఎస్ కార్తికేయ ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు.

premalu heroine mamitha baiju

ఈ సినిమాకి ఆదిత్య హాసన్ తెలుగులో మాటలు రాయగా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చింది. నవ్వుల విందుగా ఉంది అంటూ కొన్ని మంది సినిమాని పొగుడుతూ ఉండగా మరి కొంతమంది హీరోయిన్ ఎంత బాగుందో అంటూ ఆమె అందానికి ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న ఈ హీరోయిన్ మరెవరో కాదు మమిత బిజు. 2017లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ స్కూల్ డైరీస్, హనీ బీ వంటి చిత్రాలలో నటించి అలరించింది.

premalu heroine mamitha baiju

చాలా సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా నటించిన మమిత ఒకేసారి ప్రేమలు లో మెయిన్ లీడ్ గా నటించి ఓవర్ నైట్ స్టార్డం ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మమిత యాక్టింగ్ చాలా మెచ్యూర్డ్ గా కనిపించింది. ఏకంగా ఎస్ఎస్ రాజమౌళి చేసే ప్రశంసలు అందుకుంది మమిత. ఒక గిరిజలాగా, ఒక సాయి పల్లవి లాగా ఉన్నావు అంటూ రాజమౌళి మమితను పొగడ్తలతో నింపేశారు. ఈ సినిమా తర్వాత మమితకు తెలుగులో కూడా మంచి ఆఫర్లు వస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఫ్యూచర్లో తన సినిమాలు కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.


End of Article

You may also like