మంచు విష్ణు: వరల్డ్ ఫేమస్ డాక్టర్ ఇండియాలోనే ఉన్నారు.. వైద్యం కోసం మలేషియా రావడం ఎందుకు అన్నారు డాక్టర్లు..!!

మంచు విష్ణు: వరల్డ్ ఫేమస్ డాక్టర్ ఇండియాలోనే ఉన్నారు.. వైద్యం కోసం మలేషియా రావడం ఎందుకు అన్నారు డాక్టర్లు..!!

by Sunku Sravan

Ads

మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైన ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో ఆయన హైదరాబాదులోని ఏఐజి హాస్పిటల్లో మా సభ్యులకు  వైద్య పరీక్షలు శిబిరాన్ని నిర్వహించారు. దీని అనంతరం ఆయన నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అధ్యక్షుడు మంచు విష్ణు మరియు సినీ నటుడు నరేష్ పాల్గొని మాట్లాడుతూ మా సభ్యులకు వైద్య పరీక్షలు చేయడానికి ఏఐజీ ఆస్పత్రి ఇలా ముందుకు రావడం చాలా మంచి పరిణామమని, ఆస్పత్రి రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదని మంచి విషయం అన్నారు.

Video Advertisement

రాబోయే రోజుల్లో కూడా “మా” నుంచి ఆస్పత్రికి ఇలాంటి సాయం కావాలని కోరిన చేస్తామని తెలియజేశాడు. గతంలో నేను మలేషియాకి వెళ్ళినప్పుడు షూటింగ్ సమయంలో గాయాలయ్యాయని తెలిపారు. ఆ టైంలో మా కుటుంబం మొత్తం మలేషియాలోని ఉన్నామని అన్నారు. దీంతో నాతో సహా మా కుటుంబ సభ్యులు కూడా ఒక ఆస్పత్రిలో హెల్త్ చెకప్ చేశారని అన్నారు.

ఆ సమయంలో ఒక డాక్టర్ నా దగ్గరికి వచ్చి వరల్డ్ ఫేమస్ వైద్యులు నాగేశ్వర్ రెడ్డి మీ ఇండియాలోనే ఉన్నప్పుడు మలేషియాకు రావడం ఎందుకని అన్నారు.. అంటే అంతటి గొప్ప వైద్యుడు “మా” సభ్యులకు ప్రస్తుతం సేవలు చేసేందుకు ముందుకు వచ్చారని కొనియాడారు. అనంతరం నరేష్ మాట్లాడుతూ మా అసోసియేషన్ కు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సభ్యులకు సినిమాల్లో అవకాశాలు కల్పించడం కోసం చాలా పని చేశామని అన్నారు. వారికి బీమా సౌకర్యం కూడా ఇచ్చామని తెలియజేశారు.

 


End of Article

You may also like