14 ఏళ్ల తర్వాత మళ్లీ నాగార్జున తో జతకడుతున్న హీరోయిన్… ఎవరో తెలుసా?

14 ఏళ్ల తర్వాత మళ్లీ నాగార్జున తో జతకడుతున్న హీరోయిన్… ఎవరో తెలుసా?

by Mounika Singaluri

పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దుమ్ము రేపుతుంది ప్రియమణి. తన వలపు వయ్యారాలతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. వయసు పెరిగిన ఈ భామలో జోరు ఏమాత్రం తగ్గలేదు. వరుస సినిమా ఆఫర్స్ తో ఫుల్ జోష్ లో ఉంది ఈ భామ.

Video Advertisement

ప్రస్తుతం ఈమె చేతిలో ఐదారు సినిమాలు ఉన్నాయి వాటితో పాటు వెబ్ సిరీస్ లు టీవీ షోలు చేస్తూ, ఫోటోషూట్లతో సొగసులన్నీ వడ్డించేస్తూ అభిమానులను కనువిందు చేస్తుంది. 2003లో ఎవరే అతగాడు సినిమా ద్వారా తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టింది ప్రియమణి.

తరువాత మంచి మంచి సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక హీరో నాగార్జున కూడా వయసు పెరిగిందన్న మాటే కానీ అందంలోనూ, యాక్టివ్ నెస్ లోనూ ఏ మాత్రం తగ్గకుండా కుర్ర హీరోలకి గట్టి పోటీని ఇస్తున్నాడు. అంతేకాకుండా బిగ్ బాస్ షో చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులకు అవుతున్నాడు. మొన్ననే నా స్వామి రంగా సినిమాతో హిట్ అందుకున్నాడు నాగార్జున. అయితే ఇప్పుడు ఇద్దరి బయోగ్రఫీ ఎందుకు అంటే అసలు కధేమిటో చూద్దాం రండి.

age gap between nagarjuna and these heroines

వీరిద్దరూ కలిసి 2010లో రగడ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలో ప్రియమణితో పాటు అనుష్క కూడా నటించింది. అయితే ఈ సినిమా ఆశించినంత హిట్ సాధించలేకపోయింది కానీ తమిళ హిందీ భాషలలో ఈ సినిమాని డబ్ చేశారు. ఆ తరువాత వీరిద్దరూ కలిసి నటించలేదు. 14 ఏళ్ల తర్వాత మళ్లీ వీళ్ళిద్దరూ ఒక సినిమా కోసం కలిసి నటించబోతున్నారు.

ఒక అద్భుతమైన స్టోరీ కోసం వీరు కలిసి పని చేస్తున్నారని సినీ వర్గాల సమాచారం. కొత్త డైరెక్టర్ సుబ్బు దర్శకత్వంలో కోర్టు డ్రామాగా సాగే ఒక స్పెషల్ స్టోరీలో వీళ్ళిద్దరూ కలిసి నటించబోతున్నారు. అయితే ఇంతకుమించి ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ బయటికి రాలేదు. ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు, ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.


You may also like

Leave a Comment