Citadel Review : “ప్రియాంక చోప్రా” నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Citadel Review : “ప్రియాంక చోప్రా” నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Anudeep

Ads

ఈ మధ్య సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కి కూడా క్రేజ్ మామూలుగా ఉండట్లేదు. భాషతో సంబంధం లేకుండా ఏదైనా ఒక వెబ్ సిరీస్ ఒక భాషలో రూపొందిస్తే ఆ వెబ్ సిరీస్ ని మిగిలిన భాషల్లోకి కూడా డబ్ చేసి అన్ని ప్రాంతాల ప్రేక్షకులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పుడు అలాగే ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ విడుదల అయ్యింది. ఇది ఇంగ్లీష్ లో రూపొందించినా కూడా తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. ఇది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • వెబ్ సిరీస్ : సిటాడెల్
  • నటీనటులు : రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రా, స్టాన్లే టుక్సి, లెస్లే మ్యాన్‌విల్లే, ఓసీ ఇఖిలే, యాష్లే
  • దర్శకత్వం : న్యూటన్ థామస్ సిగెల్, జెస్సికా యు, రుసో బ్రదర్స్
  • నిర్మాత : అమెజాన్ ప్రైమ్ వీడియో
  • ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో
  • ఎపిసోడ్స్ : 2 (మిగిలినవి వారానికి ఒకటి చొప్పున విడుదల అవుతాయి)
  • విడుదల తేదీ : ఏప్రిల్ 28 , 2023citadel web series story, review, rating..!!

స్టోరీ:

మేసన్ కేన్ (రిచర్డ్ మాడెన్), నాదియా సిన్హ్ (ప్రియాంక చోప్రా) గ్లోబల్ స్పై ఏజెన్సీ సిటాడెల్‌కు చెందిన టాప్ ఏజెంట్లు. ఒక సీక్రెట్ మిషన్ మీద వెళ్తే అది తమ కోసం వేసిన ట్రాప్ అని తెలుస్తుంది. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో జరిగిన ప్రమాదంలో మేసన్ తన గతాన్ని మర్చిపోతాడు. ఆ సమయంలోనే సిటాడెల్ కూడా అంతం అయిపోతుంది.

citadel web series story, review, rating..!!

అయితే ఎనిమిది సంవత్సరాల తర్వాత సిటాడెల్ ఏజెంట్ల వివరాలు, న్యూక్లియర్ కోడ్స్ ఉన్న ఒక బ్లాక్ బాక్స్ సీఐఏకి దొరికిందని ‘మాంటికోర్’ అనే టెర్రరిస్ట్ సంస్థకు తెలుస్తుంది. వారు కూడా ఆ బాక్స్ కోసం ఎప్పటినుంచో వెతుకుతూ ఉంటారు. అనుకోకుండా ఈ గేమ్‌లోకి మేసన్ కేన్ తిరిగి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? నాదియా ఏం అయింది? అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

 

రివ్యూ:

ప్రస్తుతానికి ఈ సిరీస్‌లో రెండు ఎపిసోడ్లు మాత్రమే విడుదల అయ్యాయి. ఈ రెండు ఎపిసోడ్లలో కథ కొంచెమే రివీల్ చేశారు. ఒక కుట్ర కారణంగా సమూలంగా అంతం అయిన ఒక స్పై ఏజెన్సీకి చెందిన ఇద్దరు ఏజెంట్లు ప్రపంచాన్ని కాపాడటానికి మళ్లీ ఎలా కలిశారన్నది ఈ ఎపిసోడ్లలో చూపించారు.

citadel web series story, review, rating..!!
అసలు ప్రమాదం ఏంటి? సిటాడెల్‌లో ఉన్న డబుల్ ఏజెంట్ ఎవరు? ఇలా చాలా ప్రశ్నలు ఎపిసోడ్ల కోసం ఎదురు చూసేలా చేస్తాయి. నిజానికి మేకర్స్‌కు కావాల్సింది కూడా ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేయడమే. అందులో మాత్రం సక్సెస్ అయ్యారు.

citadel web series story, review, rating..!!

స్పై ఏజెంట్లు మేసన్ కేన్, నదియాలుగా రిచర్డ్ మ్యాడెన్, ప్రియాంక చోప్రా జోన్స్ సరిగ్గా సూట్ అయ్యారు. తొలి ఎపిసోడ్స్ లోనే తన యాక్షన్ తో అదరగొట్టారు. యాక్షన్ సన్నివేశాల్లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. మిగతా నటులందరూ తమ పరిధి మేర నటించారు.

ప్లస్ పాయింట్స్:

  • యాక్షన్ సీక్వెన్స్‌లు
  • నటీనటుల ప్రదర్శన
  • స్టోరీ

citadel web series story, review, rating..!!

మైనస్ పాయింట్స్:

  • గందరగోళంగా సన్నివేశాలు
  • మ్యూజిక్

రేటింగ్:

3 /5

ట్యాగ్ లైన్:

స్పై, యాక్షన్, థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లను ఇష్టపడే వారికి ‘సిటాడెల్’ మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.


End of Article

You may also like