ఐపీఎల్ 2020 లో ఈ 9 ప్రైజులు గెలుచుకున్న ప్లేయర్స్ ఎవరో చూడండి…ఎవరికి ఎంత మనీ అంటే .?

ఐపీఎల్ 2020 లో ఈ 9 ప్రైజులు గెలుచుకున్న ప్లేయర్స్ ఎవరో చూడండి…ఎవరికి ఎంత మనీ అంటే .?

by Mohana Priya

Ads

నిన్న జరిగిన ఐపిఎల్ -2020 ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 రన్స్ చేసింది. ఢిల్లీకి మంచి ప్రారంభం దక్కలేదు.

Video Advertisement

ప్రారంభంలోనే కీలక 3 వికెట్లు కోట్పోయింది. అయితే ఆ తర్వాత రిషబ్ పంత్(56), శ్రేయాస్ అయ్యార్(65) ఎక్కువ సేపు క్రీజులో ఉండటంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ముంబై బౌలర్లలో  ట్రెంట్‌ బౌల్ట్‌(3/30),  కౌల్టర్‌ నైల్‌(2/29), జయంత్‌ యాదవ్‌(1/25) వికెట్లు తీశారు. 157 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ దిగిన ముంబై ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు.

డీకాక్‌(20; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) సూర్యకుమార్‌(19; 20 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) , రోహిత్‌ శర్మ(68; 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించి విజయంలో కీలక పాత్ర పోషించగా, ఇషాన్‌ కిషన్‌( 33 నాటౌట్‌; 19 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్‌) ,కృనాల్ పాండ్యా(1) విన్నింగ్ షాట్ ఆడి లాంఛనం పూర్తి చేశాడు.ఢిల్లీ బౌలర్లలో నోర్ట్‌జే 2 వికెట్లు తీయగా, రబాడా ఒక వికెట్, స్టోయినిస్‌ ఒక వికెట్ పడగొట్టారు. ఈ టౌర్నమెంట్ లో గెలిచిన వారికి  ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

# ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్ గెలుచుకున్న దేవ్ దత్ పడిక్కల్ కి 10 లక్షల ప్రైజ్ మనీ ఇచ్చారు.

# మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డ్ గెలుచుకున్న జాఫ్రా ఆర్చర్ కి 10 లక్షల ప్రైజ్ మనీ బహుమతిగా ఇచ్చారు.

# ఫెయిర్ ప్లే అవార్డ్ ని ముంబై ఇండియన్స్  జట్టు గెలుచుకుంది.

# గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్ అవార్డ్ గెలుచుకున్న కేఎల్ రాహుల్ కి 10 లక్షల రూపాయలు బహుమతిగా ఇచ్చారు.

# సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డ్ గెలుచుకున్న కీరన్ పొలార్డ్ కి 10 లక్షల రూపాయలను ఇచ్చారు.

# మోస్ట్ సిక్సెస్ అవార్డు గెలుచుకున్న ఇషాన్ కిషన్ కి 10 లక్షల రూపాయలను ఇచ్చారు.

# పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ టైటిల్ గెలుచుకున్న ట్రెంట్ బౌల్ట్ కి 10 లక్షల రూపాయలను అందజేశారు.

# ఈ సీజన్లో పర్పుల్ క్యాప్ గెలుచుకున్న కగిసో రబాడా కి 10 లక్షల రూపాయలను బహుమతిగా ఇచ్చారు.

# ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న కేఎల్ రాహుల్ కి 10 లక్షల రూపాయలను ఇచ్చారు.

 


End of Article

You may also like