ప్రతి ఇంట్లోనూ గొడవలు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న మాటలు అనుకోవడం లేదంటే ఒక్కొక్కసారి ఒకరి మీద ఒకరు అరుచుకోవడం ఇలాంటివి ప్రతి ఇంట్లో ఉండేవే. అత్తా కోడళ్ళ మధ్య భార్యా భర్తల మధ్య లేదంటే తోటి కోడళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి.

Video Advertisement

గొడవ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ మామూలుగా ఉండటం మంచిది. ఒకరి మీద ఒకరు ద్వేషం పెట్టేసుకుని ఉంటే ఒక ఇంట్లో ఉండలేము.

చాలా మంది తోటి కోడళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. ఉమ్మడి కుటుంబంలో ఇటువంటివన్నీ కామన్ అని మీరు పక్కన పెట్టేయాలి. తోటి కోడళ్ళ మధ్య గొడవలు రావడం.. సూటిపోటి మాటలు అనుకోవడం.. చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం. మీరు కూడా ఇదే ఇబ్బందితో సతమతమవుతున్నారా..? అయితే దీనిని ఈ విధంగా పరిష్కరించుకోండి. ఇలా చేయడం వల్ల సులువుగా మీరు సమస్యను పరిష్కరించుకోవచ్చు.

#1. ఏదైనా సమస్య వస్తూ ఉంటే ఇతరుల స్వభావాన్ని మనం మార్చలేము. ఇది కష్టం. అలాంటప్పుడు మనల్ని మనమే మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.
#2. మీ తోటి కోడలు వలన కనుక మీరు బాధపడుతూ ఉంటే మీ యొక్క బాధలను తనతో తెలపండి.
మీకు వుండే సమస్యను చూపించి ఆమె పదే పదే దెప్పుతుంటే… దాని గురించి చెప్పండి. ఇలా ఏ సమస్యకైనా సరే చెప్పడం చాలా ముఖ్యం.


#3. ఒకవేళ కనుక చెప్పినా వినకపోతే కుటుంబ సభ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోండి. మీకు కలిగే ఇబ్బందులు వివరించండి.
#4. అలానే కుటుంబం అంతా ఆనందంగా ఉండటం కోసం మీరు ఎలా ప్రయత్నం చేస్తున్నారు అనేదాని గురించి చెప్పండి. ఇలా ఫైనల్ గా ఒక పరిష్కారాన్ని కనుగొనండి. అంతేకానీ ఆవేశంతో ఊగిపోతూ ఉంటే ఏ సమస్యలు పరిష్కారం కావు.
#5. మొదట మీరు మీ యొక్క స్వభావాన్ని కాస్త మార్చుకుంటే అప్పుడు ఖచ్చితంగా సమస్య సాల్వ్ అవుతుంది. వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ తీసుకున్నా కూడా సమస్య నుండి బయట పడవచ్చు.