మగవాళ్ళు ఎదుర్కొనే 6 సమస్యలు ఏంటో తెలుసా..? వీటి గురించి ఎవరూ మాట్లాడరు ఎందుకు..?

మగవాళ్ళు ఎదుర్కొనే 6 సమస్యలు ఏంటో తెలుసా..? వీటి గురించి ఎవరూ మాట్లాడరు ఎందుకు..?

by Mounika Singaluri

Ads

సమస్యలకు లింగభేదం ఉండదు. అయితే సమస్యలను ఎదుర్కొనే ధోరణి మాత్రం అందరిలో ఒకేలా ఉండదు. మన సమాజంలో ఆడవాళ్లు, మగవాళ్లకు వేర్వేరు రకాల సమస్యలు ఎదురవుతాయనే మైండ్ సెట్‌ ముందు నుంచి ఉంది. కానీ అది తప్పు. ఆ సమస్యలు ఎలా ఎదుర్కొంటారు అన్న దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. అయితే పురుషులకు ఏ రకమైన సమస్యలు ఉండవు అని కొందరు అనుకుంటారు. కానీ వారికీ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి.. వాటితో పాటు వారికి కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి.

Video Advertisement

ఈ సమస్యల కారణంగా పురుషులు ఎన్నో మానసిక ఆరోగ్య సమస్య ల బారిన పడుతూ ఉంటారు. అంతే కాకుండా డిప్రెషన్ లోకి వెళ్లి తీవ్ర నిర్ణయాలు తీసుకొనే అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుత కాలం లో పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

problems faced by men..

#1 సమస్యలను ఎదుర్కొనే దారి..

పురుషులు తమకి ఎదురయ్యే సమస్యల నుంచి తప్పించుకుంటారు అనుకుంటారు అందరూ. కానీ వారికి ప్రతి విషయం లోను ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. ఒక సమస్య తీరిపోయింది అనుకుంటే.. ఇంకో సమస్య ఎదురవుతుంది. వాటిని ఎదుర్కోవాలి అంటే వాటిని చూసే దృక్పథాన్ని మార్చుకోవాలి.

#2 కెరీర్ గ్రోత్

ఇదివరకటి కాలం తో పోలిస్తే ప్రస్తుతం మహిళలు కూడా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇది పురుషులను కాస్త వెనక్కి నెట్టేస్తుంది. కానీ మనం ఎదుగుతూ ఇతరుల ఎదుగుదలలో కూడా మన సహకారాన్ని అందిస్తేనే మనకి ప్రేరణ లభిస్తుంది.

problems faced by men..

#3 యాంత్రికంగా జీవించటం

పురుషులు చాలా వరకు యాంత్రికంగా జీవించడాన్ని మనం చూడొచ్చు. ఎటువంటి అనుభూతులు లేకుండా, తరచూ విసుగు చెందుతూ, నిస్సారంగా జీవిస్తూ ఉంటారు. రోజూ ఒకటే లాంటి పనిని చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవడం తప్పనిసరి. మన మనసుకు నచ్చినవారితో సమయాన్ని గడపటం వల్ల కూడా మన జీవితం ఉత్సాహంగా మారుతుంది.

#4 వారి పై వారికి అనుమానం

మన సమాజం లో పురుషులు ఆడవారికన్నా బలవంతులు, వారు ఆడవారిని రక్షించాలి అని ఎప్పటినుంచో నాటుకుపోయింది. దీంతో తరచూ పురుషులు తమ సరైన రీతిలోనే వెళ్తున్నామా.. బలంగా ఉన్నామా అనుకొంటూ తమని తాము తక్కువ చేసుకుంటూ ఉంటారు.

problems faced by men..

#5 లక్ష్యాలు

అందరికి చాలా కలలు, లక్ష్యాలు ఉంటాయి. కానీ వాటిని సాధించగలమా లేదా అన్న ప్రశ్న వేధిస్తూ ఉంటుంది. అందుకే తమ లక్ష్యాలను ఎప్పటికప్పుడు గుర్తుచేసుకుంటూ ప్రేరణ పొందాలి.

#6 తిరస్కరణ (రిజెక్షన్)

పురుషులు చాలా సమయాల్లో రెజెచ్తిఒన్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది కేవలం ప్రేమ విషయం లోనే కాదు. ఉద్యోగాలు, డీల్స్ ఇలా ఎన్నో విషయాల్లో వాయు రెజెచ్తిఒన్ ని ఎదుర్కొంటారు. కానీ వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మీ తప్పులను మీరు సరిదిద్దుకోవాలి.

problems faced by men..

#7 అంచనాలు

స్త్రీలు ఇలాగే ఉండాలి. సన్నగా ఉండాలి. అందంగా ఉండాలి అని ఎన్నో అంచనాలు ఉంటాయి. అలాగే అబ్బాయిలకు కూడా ఎన్నో అంచనాలు ఉంటాయి. వీటివల్ల వారు ఎంతో ఒత్తిడికి గురవుతారు.

ఇలాంటి ఎన్నో సమస్యలను, సవాళ్ళను పురుషులు ఎదుర్కొంటారు. వారు వాటిని ఎదుర్కోవడం లో ఇతరులు కూడా వారికి సహకరించాలి.


End of Article

You may also like