పుట్టినప్పటినుంచి… చివరి వరకు … సమాజంలో కేవలం “ఆడవాళ్లు” మాత్రమే ఎదుర్కొనే 5 సమస్యలు ఏంటో తెలుసా..?

పుట్టినప్పటినుంచి… చివరి వరకు … సమాజంలో కేవలం “ఆడవాళ్లు” మాత్రమే ఎదుర్కొనే 5 సమస్యలు ఏంటో తెలుసా..?

by Anudeep

Ads

ప్రపంచం ఎంత ముందుకు వెళ్తున్నా.. మారనిది ఏమైనా ఉంది అంటే అది స్త్రీ కి దురయ్యే సవాళ్ళే..పుట్టినప్పటి నుంచి వారు వద్దు, కూడదు అన్న మాటలే ఎక్కువగా వింటూ ఉంటారు. ఎవరి తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, అనుమతి తీసుకొనే ఏ పనైనా చేయాలి.. గట్టిగా నవ్వకూడదు.. ఇలాంటి దుస్తులే ధరించాలి.. ఇలా ప్రతి దాన్లో ఆమెను కంట్రోల్ చేస్తూనే ఉంటారు. అయితే కాలం మారే కొద్దీ మహిళల పరిస్థితి లో కాస్త మార్పు వచ్చినా.. వాటి కన్నా వారికున్న సవాళ్ళే ఎక్కువగా ఉన్నాయి.

Video Advertisement

 

#1 ఒక అమ్మాయి మంచి చదువులు చదువుతూ ఉంటే.. అంత చదివించటం అనవసరం.. ఎలాగో పెళ్లి చేసి పంపించాల్సిందే కదా.. అని సలహాలు ఎక్కువైపోతాయి. అలాంటి మాటలు అమ్మాయి తల్లిదండ్రులు వింటే వెంటనే పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టేస్తారు. అలా కాదని ఆ అమ్మాయిని బాగా చదివించి ఉద్యోగం చేయించే తల్లిదండ్రులు ఉంటారు. ఈ రెండు సందర్భాల్లోనూ మహిళలకు ఇబ్బందులు ఉండటం కామన్.

problem faced by woman

#2 పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిన అమ్మాయిలకు పుట్టింటిలో కన్నా ఎక్కువ సవాళ్ళే ఉంటాయి. చేసిన ప్రతీది తప్పు, నుంచో కూడదు.. కూర్చోకూడదు ఇలా ఉంటుంది అక్కడ పరిస్థితి. కొన్ని సందర్భాల్లో హింస కూడా ఉండే అవకాశం ఉంది. అత్తారింట్లో జరిగే ఆకృత్యాలు భరించలేక కొందరు మహిళలు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అది తప్పు. అలా కాకుండా వారిని విడిచిపెట్టి వచ్చి ఒంటరిగా జీవించే వాళ్ళని బ్రతకనివ్వదు సమాజం.

problem faced by woman

#3 ఒకవేళ బాగా చదివి ఉద్యోగం చేస్తున్న అమ్మాయి అయితే ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటూ ప్రశ్నలు.. కొంత కాలానికి వారిని వింతగా చూడటం మొదలు పెడతారు. మరోవైపు ఉద్యోగ జీవితం లో ఒడిదొడుకులు కూడా ఉండనే ఉంటాయి. ఒత్తిడి, వేధింపులు తప్పనిసరి. ఇలా కాకుండా పెళ్లయి ఉద్యోగం చేసే మహిళకు ఆ ఉద్యోగంతో పాటు ఇంటి పని, వంట పని తప్పదు. భర్త ఎంత చదువుకున్న వాడైనా భార్యని అర్థం చేసుకోవడం లో మాత్రం జీరోనే. ఇలా ఈ స్ట్రెస్ భరించలేక ఉద్యోగాల్ని వదులుకునే వారూ చాలా మందే ఉంటారు.

problem faced by woman

#4 తమ కొడుక్కి వధువును వెతుకుతున్న సమయం లో వారి కొడుకు ఏ రంగులో ఉన్నా సరే వారికి మాత్రం తెల్లగా ఉన్నా అమ్మాయే కావాలి. ఒకవేళ అమ్మాయి రంగు తక్కువగా ఉన్నట్లయితే వారిని తమ లిస్ట్ లో నుంచి తీసేస్తారు. అలాగే ఒక అమ్మాయి కి కళ్ళ జోడు ఉన్నా కూడా అది ఆ అమ్మాయి తప్పే.

problem faced by woman

#5 అలాగే ఒక అమ్మాయి ఎవరినైనా ప్రేమించింది అంటే అది ఈ సమాజం దృష్టిలో చాలా తప్పు. ఎదో అంటరాని దానిలా చూస్తారు. వారి తల్లిదండ్రులు, సమాజం మాటలు పరిగణన లోకి తీసుకుంటే ఆమె జీవితం నరకమే. అలాగే ఒక అమ్మాయి రాత్రిళ్ళు బయటకు వెళ్లడం చాలా తప్పు అలాగే ప్రస్తుత సమాజం లో అది అపాయం కూడా.

problem faced by woman

జీవితం అనే పరుగు పందెం లో ఎవరి రేస్ వారిదే. కానీ ఈ రేస్ లో మగువలు ఎప్పుడు వెనక బడుతుంటారు. ఇందులో గెలవాలంటే ముందు పరిగెత్తాలి. శ్రమ పడాలి. సొంత నిర్ణయాలు తీసుకొనే ధైర్యం చేయాలి. ఆర్థిక స్వాతంత్రం ఉండేలా చూసుకోవాలి. వీటితో పాటు శారీరక ఆరోగ్యం .. మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే.


End of Article

You may also like