“అదే మేము చేసిన అతి పెద్ద పొరపాటు..!” అంటూ… “ఏజెంట్” ప్రొడ్యూసర్ పోస్ట్..! ఏం అన్నారంటే..?

“అదే మేము చేసిన అతి పెద్ద పొరపాటు..!” అంటూ… “ఏజెంట్” ప్రొడ్యూసర్ పోస్ట్..! ఏం అన్నారంటే..?

by kavitha

Ads

యంగ్ హీరో అఖిల్‌ అక్కినేని హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్‌’. డైరెక్టర్ సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మాత అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకం పై నిర్మించారు.

Video Advertisement

ఈ సినిమా ఏప్రిల్‌ 28న రిలీజ్ అయ్యింది. కానీ మొదటి  షో నుండే నెగెటివ్ టాక్‌ వచ్చింది. డైరెక్టర్, నిర్మాతల పై ఆడియెన్స్ అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ క్రమంలో ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ వెంటనే వైరల్ గా మారింది.
ఈ చిత్రాన్ని దాదాపు 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం కనీసం 10 కోట్ల షేర్‌ సాధించలేకపోయింది. ఏజెంట్‌ సినిమా ఈ సంవత్సరం అతి పెద్ద డిజాస్టర్‌ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం పై అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కినేని ఫ్యాన్స్ కూడా చాలా నిరాశ పడ్డారు. సాధారణ ప్రేక్షకులు సైతం మూవీ పై కామెంట్లు చేస్తున్నారు. విడుదల అయిన దగ్గర నుంచి మూవీ పై రకరకాలగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ రిజల్ట్ పై ప్రొడ్యూసర్ అనిల్‌ సుంకర స్పందించారు.
ఏజెంట్ అపజయానికి బాధ్యత వహిస్తూ ఆడియెన్స్ కి క్షమాపణలు చెప్తూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ సారాంశం ఏమిటి అంటే “ఏజెంట్‌ మూవీ ఫెయిల్యూర్‌ కి సంబంధించిన పూర్తి నిందను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ మూవీ మాకు పెద్ద టాస్క్ అని తెలిసినప్పటికీ, విజయం సాధించాలనే పట్టుదలతో ముందుకెళ్లాం. అయితే బౌండెడ్‌ స్క్రిప్ట్ తమ దగ్గర లేకుండా సినిమాని మొదలు పెట్టి పెద్ద పొరపాటు చేశాం. కోవిడ్‌తో సహా చాలా సమస్యలు రావడం వల్ల విఫలమయ్యాం.
ఫెయిల్యూర్‌ కు ఎలాంటి సాకులు చెప్పాలని మేము అనుకోవట్లేదు. అయితే ఈ కాస్ట్లీ తప్పు నుండి నేర్చుకుని, మళ్ళీ ఇలాంటి తప్పులను ఎప్పటికీ రిపీట్ కాకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం. మాపై ఎంతో నమ్మకం ఉంచిన అందరికి మనస్పూర్తిగా క్షమాపణలు తెలియచేస్తున్నాను. రాబోయే సినిమాల విషయంలో పక్కా ప్రణాళికతో కష్టపడి నష్టాలను భర్తీ చేస్తామని తెలియజేస్తున్నాం” అని ప్రొడ్యూసర్ అనిల్‌ సుంకర ట్వీట్‌ చేశారు.

Also Read: చిరంజీవి “ఇంద్ర” నుండి… రామ్ చరణ్ “వినయ విధేయ రామ” వరకు… ప్రేక్షకులకి “లాజిక్” మిస్ అయినట్టు అనిపించిన 16 సినిమాల సీన్స్..!


End of Article

You may also like